Paramchaitanya Puja

Taufkirchen (Germany)

Feedback
Share

ఈ రోజు మనం ఏ పూజ చేయబోతున్నాం అని నన్ను అడిగారు. నేను దానిని రహస్యంగా ఉంచాను. ఈ రోజు మనం పరమ చైతన్యమును ఆరాధించాలి. అదే అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క ప్రేమ. పరమ చైతన్యము దయతో ప్రతిదీ పనిచేస్తుందని మనందరికీ తెలుసు, కనీసం మానసికంగా అయినా తెలుసు. ఇదే ఆదిశక్తి యొక్క శక్తి. కానీ ఇప్పటికీ ఈ విషయం మన హృదయంలో గానీ, మన ధ్యాసలో కానీ అనుకున్నంతగా లేదు. ఒక మహా సముద్రము వలె పరమ చైతన్యము అంతటినీ తనలో కలిగి ఉన్నది. ప్రతిదానికి, పని చేసే ప్రతీ దానికీ స్వంత పరిమితులు ఉంటాయి. అందువలన పరమ చైతన్యమును దేనితోనూ పోల్చలేము. సూర్యుడిని గమనిస్తే, కొన్ని పనులు జరగాలంటే సూర్యుడి ద్వారా వర్షాలు రావాలి.

అధికారంలో ఉన్న ఒక వ్యక్తిని గనక మీరు చూస్తే, బయటికి అతను తన అధికారాన్ని/శక్తిని చూపించాలి.  కానీ అతను లోపల అలా అధికారాన్ని చూపించడు. ఉదాహరణకి ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనం లో ఒక వృక్షం పెరుగుతుంది, ఫలాలు వస్తాయి, వాటిని అమ్ముతారు, ప్రజలు వాటిని తింటారు. ఇదంతా ఆ విత్తనంలో ఉన్నది. అదే పరమ చైతన్యము.  మనందరం అందులోనే నిబిడీకృతం అయి ఉన్నాము. మనం చూసేది అలలను మాత్రమే. మనం ఆ అలలమీద ఉన్నట్లు చూస్తే, స్థానభ్రంశం చెందినట్లుగా, వేరు చేయబడినట్లుగా కనిపిస్తుంది. సరిగ్గా, ఇది జర్మనీ, ఇది ఇంగ్లాండ్, ఇది భారత దేశం అని మనం భావిస్తున్నట్లే ఉంటుంది. ఇవి పరమ చైతన్యపు చీర యొక్క మడతలు. అవి బయటికి వేరుగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అవి వేరుగా లేవు, అవి అన్నీ కలిసే ఉన్నాయి. అందువలన అవి ఖచ్చితంగా పూర్తిగా అనుసంధానించబడి ఉన్నాయి.  నేను గనక ఒక దారపు పోగును చీర నుండి లాగితే, మొత్తం దారపు పోగు చీర నుంచి లాగివేయబడుతుంది. అలాగే పరమ చైతన్యం తనలో తానే పనిచేస్తుంది. పరమ చైతన్యం లేకుండా ఏమీ లేదు. అందువలన సహజయోగులైన మీ మీద పరమ చైతన్యం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.  లేదా అది  మీతో ఖచ్చితంగా మమేకం అవుతుంది అని చెప్పాలి. మీరు పరమచైతన్యంతో మమేకం అయినప్పుడు  మీరు ఏది కోరుకున్నా, ఏది కావాలనుకున్నా అది కూడా పరమచైతన్యం నుండే లభిస్తుంది. అల్ల కల్లోలంగా ఉన్న సముద్రంలో కొన్ని నీటి బిందువులు గాలిలోకి ఎగిరి అవి సముద్రముకంటె పైన ఉన్నట్లు, ప్రపంచానికి దూరంగా  ఉన్నట్లు, సముద్రానికి దూరంగా ఉన్నట్లు ఆలోచించటం ప్రారంభిస్తాయి. కానీ మళ్ళా అవి సముద్రలోనే పడాలి. అందువలన ఈ నిరాకార శక్తికి ఎంతో జ్ఞానము, ఎంతో సమన్వయము, నిర్వహణా చాతుర్యం, అన్ని కంప్యూటర్లు , అన్ని టెలివిజన్లు, మీరు అనుకునే అన్ని రకాల సమాచారాలు, కేంద్రాలు, పాలక, పరిపాలనా చాతుర్యం ఉన్నాయి. అన్నింటికీ మించి ఇది ప్రేమ. ఇదే భగవంతుని ప్రేమ మరియు మీ తల్లి యొక్క ప్రేమ. 

కాబట్టి ఈ పరమచైతన్యంతొ మమేకం అవ్వాలంటే మీరే సత్యం అవ్వాలని  మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు మీరు ఇక్కడ కూర్చున్న నాకు ఫోటో తెస్తే, అది ఫోటో అయినప్పటికీ, నా ఫోటో మీకు వైబ్రేషన్స్ ను ఇస్తుంది. కానీ మీరు వేరొకరి ఫోటో తీస్తే అది సహజయోగాన్ని ఇవ్వలేదు. కారణం వేరొకరు సత్యం అవ్వలేదు. ఎలా అంటే, మీరు వర్షం పడుతున్న పెయింటింగ్ చూసారనుకుందాం, ఈ వర్షం పువ్వులను పెంచదు, అక్కడ ప్రజల బట్టలను తడపదు, ఈ వర్షం చలనం లేనిది. అందువలన అజ్ఞానంలో వాస్తవికత గురించి చెప్పే చలనం లేని చిత్రం  ఉంది. అందువలనే ప్రతిదీ మనమే చేయగలం అని అనుకుంటూ ఉంటాము. 

ఇప్పుడు ఎవరైనా ఈ చిత్రాన్ని సరిగా చూసాను మరియు నేను ఆ వర్షాన్ని నిజం చేస్తాను అని చెప్తారు, కానీ మీరు చెయ్యలేరు. ఎలా అయినా ప్రయత్నించండి, మీకు నచ్చిన ఏ రంగునైనా వెయ్యండి, అది ప్రయత్నంతో నిజమైన వర్షంలా కనిపించవచ్చు, కానీ దానికి వాస్తవికత యొక్క సామర్ధ్యం గానీ, స్వభావం గానీ ఉండదు. అందువలన మానవులు  ఎప్పుడు అవాస్తవమైన విషయాలతో వారు గొప్పగా చేస్తున్నారని అనుకుంటారు. మనం నిజమైన పూలని ఆస్వాదించవచ్చు. మనం అలాంటి ప్లాస్టిక్ పూలని తయారు చేయవచ్చు. మనం నిజమైన పూలలాంటి  పెయింటింగ్స్ వేయవచ్చు. కానీ మనం స్వంతగా ఒక్క నిజమైన పువ్వునైనా ఉత్పత్తి చేయలేము. భూమి తల్లి ఈ పువ్వును ఉత్పత్తి చేస్తుందనే వాస్తవానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. లేదా సూర్యుడు భూమితల్లికి సహాయం చేస్తాడు. కాబట్టి సహజయోగులందరూ తెలుసుకోవాల్సిందేమిటంటే వాస్తవానికి  మీరు ఏమీ చేయరు, అంతా పరమ చైతన్యం ద్వారా చేయబడుతుంది. సహజ యోగికి , సహజ యోగి కానీ వారికి తేడా ఏమిటంటే, సహజ యోగి కానీ వారికి పరమ చైతన్యమే అంతా చేస్తుందనే విషయం తెలియదు, ఒకవేళ తెలిసినా అతని మనసుకి వాస్తవం అనిపించదు, అతని జీవితంలో మమేకం కాదు. కానీ సహాజ యోగికి పరమ చైతన్యమే వాస్తవం అని, అదే అన్నింటినీ చేయిస్తుంది అని, మరియు అదే భగవంతుని ప్రేమ అని తెలుసు. మనం చేతల నుండి ప్రేమను వేరు చేస్తాము. మన దృష్టిలో ప్రేమంటే ఒకరి మీద ఉన్న ఒక విధమైన పిచ్చి ప్రవర్తన. 

పరమ చైతన్యానికి సాంకేతికత గానీ, హాని గానీ లేదు. ఎలా ప్రేమిస్తుందంటే, ఎలాంటి అవగాహన లేకుండానే పని చేస్తుంది. మనం ఒకరిని ప్రేమిస్తున్నపుడు, మనం ఎం చేస్తామో మనకే తెలియదు. ప్రేమిస్తున్నామని మనం అనుకుంటాం రేపు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పొచ్చు. అది ప్రేమ ఎలా అవుతుంది? మనం మన పిల్లలను ప్రేమిస్తాము, మన కుటుంబాన్ని ప్రేమిస్తాము, మన స్నేహితుల్ని ప్రేమిస్తాము. అది నిజం కాదు, అదే గనక నిజం అయితే అది విఫలం కాదు. కానీ మీరు కచ్చితంగా చెప్పలేరు. మీ కొడుకుపై స్వార్ధంతో ఇవాళ మీరు మీ కొడుకు కోసం పని చేస్తారు.  కానీ రేపు అతను మీతో ఎలా ప్రవర్తిస్తాడో, మీరు అతనితో ఎలా ప్రవర్తిస్తారో మీరు చెప్పలేరు.  కానీ తన ప్రేమను ఎలా వ్యక్త పరచాలో పరమ చైతన్యానికి  తెలుసు, అంతే కాదు అది ప్రేమ యొక్క శాశ్వతమైన అనుభూతి. దాని రంగు మారవచ్చు, కానీ మీ శ్రేయస్సును కోరుకునే ఆ ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రేమ యొక్క సారాంశం శ్రేయస్సు కోరటం. ఎవరో ఒకరు పొరపాటు చేశారనుకుందాం, అయినా కూడా దైవం యొక్క చింతన ఏమిటంటే ఆ వ్యక్తిని సరిచేయడం. బాధ్యత, దీన్నే హితం అనొచ్చు, అదే, మంచిని కోరుకోవటం. ఈ మంచిని కోరే నేపథ్యంలో అది కొన్నిసార్లు క్రూరంగా కనిపించవచ్చు, ఆప్యాయంగా కనిపించవచ్చు, ఆనందంతో కూడిన తృప్తి అనిపించవచ్చు, ఒక తరంగంలా ఏ రూపంలో అయినా కనిపించవచ్చు. ఏ విధంగా కనిపించినా వాస్తవానికి  అది మీ మంచికే. 

మీకు మంచి జరగడం కోసం పని చేస్తుంది. మీ మంచికోసమే కాకుండా సామూహిక మంచి కోసం కుడా పని చేస్తుంది. దానికి ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా బాగా తెలుసు. ఇది ఎక్కడికైనా వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటి యొక్క పూర్తి జ్ఞానం తనలోనే ఎలా ఉందొ తెలుసు. ఇదీ జ్ఞానం, తెలివి మరియు ప్రేమ యొక్క నిల్వ. అందువల్ల ఇది నిర్ణీతమైన మార్గం నుంచి ప్రక్కకు మరలదు. మీరు సహజ యోగి అయిన తరవాత మీకు మంచి జరగడం కోసం మీ శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరటం జరుగుతుంది. మీరు శిక్షించబడ్డారా లేదా అన్నది వేరే విషయం. కొంతమందికి ఉద్యోగం వస్తుంది, మరి కొంతమందికి రాదు. కొంతమంది వ్యక్తులతో ఇది ఒకరకంగా పని చేస్తుంది, అదేరకంగా కొంతమంది దగ్గర పని చేయదు. ఈ పరమ చైతన్యం ఇలా ప్రవర్తిస్తున్నదేమిటని ఎవరైనా అనుకోవచ్చు. అదంతా మిమ్మల్ని సరి చేయడం కోసమే, ఇదొక పెద్ద ప్రయాణం. 

మిమ్మల్ని సరి చేయటం కోసం ఏమి జరిగిన అది మీ మంచి కొరకే. ఈ విషయాన్నీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మీరు మీ జీవితంలో ఎప్పుడూ నిరాశ పడరు. ఈ పరమ చైతన్యం తన మంచి కోసం ఎప్పుడూ ఆందోళన చెందదు, దానికదే సంపూర్ణ మంచితనం. దీనికి సహాయం ఎలా దొరుకుతుందా, మంచి ఎలా జరుగుతుందా అన్నది ఎప్పుడూ ఆలోచించదు. ఎందుకంటే పరమ చైతన్యానికి ఇబ్బందనేదే ఉండదు. ఉదాహరణకి ఒకతనికి ప్రాపంచిక సదుపాయాలు అన్నీ ఉన్నా ఇంకా కావాలని దురాశ వలన ఆందోళన చెందుతూ ఉంటాడు, కానీ పరమ చైతన్యం పూర్ణత్వం వలన దురాశ ఉండదు. దానికది పూర్తి సంతృప్తి కలిగి ఉంది. ఎందుకంటే పరమ చైతన్యంకు ఎలాంటి సందేహం, ఏ రకమైన సందేహాలు కూడా లేనంత శక్తివంతమైనది, పరిజ్ఞానం కలది.

ఎవరూ దీనికి హాని కలిగించలేరు. దీనికి భయం లేదు మరియు మీరందరూ ఇప్పుడు అనుభూతి చెంది ఉంటారు. పరమ చైతన్యం పరిపూర్ణమైన నిర్భయ జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించాలి. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని చూడగానే ఏడుపు ఆపేస్తాడు. వాళ్ళ అమ్మ కనపడింది కదా ఇక ఏడుపు రాదు. అలాగే మీకు పరమచైతన్యం లభించి దానితో అనుసంధానించబడి ఉన్నారు. అందువలన మీరు దేని గురించీ చింతించనక్కరలేదు, దేని గురించీ ఆలోచించనక్కరలేదు, దేని గురించి ప్రణాళిక వేయనక్కర్లేదు. మీరు చేయవలసినదంతా పరమచైతన్యం లోనికి దూకి, మీరు పరమ చైతన్యంలో మమేకం అయి ఉన్నారన్న విషయం తెలుసుకోవడమే. ఈ విషయాన్నీ మీరు అర్థం చేసుకోగలిగితే చాలా పెద్ద పని చేశారని భావిస్తున్నాను.     

ఇప్పుడు మనము జర్మనీ లో ఉన్నాము, జర్మనీ లో ని మానవుల ఆశలను అస్తవ్యస్తం చెయ్యటానికి ప్రయత్నించిన వ్యక్తులు ఉన్నారు. అది జరుగుతున్నపుడు, ఆ భయంకర సంఘటనలలో చాలామంది ప్రజలు చనిపోయారు, అయినా వాళ్ళు మళ్ళా జన్మ తీసుకున్నారనుకోండి, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతమైపోతుందని వారు అనుకుని ఆందోళన పడ్డారు. కానీ కత్తి గుణపాఠం నేర్పింది. మనల్ని మరింత సమిష్టిగా చేసింది మరియు మనల్ని ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేసింది. లేదంటే మనం ఈ దేశస్తులం, ఆ దేశస్తులం అని, జాతి వాదం, జాతీయ వాదం, దేశభక్తి వంటివన్నీ వేరు చేసి విడగొట్టే విషయాల అజ్ఞానం నుంచి ఎప్పుడు బయటకొస్తారు? మనమందరం మనుషులం, మనల్ని మనుషుల్లాగానే  పరిగణించాలి. చరిత్రని గమనించినట్లయితే ప్రతి యుద్ధం తరువాత ప్రపంచపు ఏకత్వం గురించిన జ్ఞానం  చాలా వేగవంతంగా వచ్చింది.  ఎలా అంటే ఒక అంతరిక్ష క్షిపణి ఉందనుకోండి, అందులో ఒక కంటైనర్ లో మరొకటి అమర్చబడి ఉంటుంది. మొత్తం అంతా ఒక వేగంతో తిరుగుతున్నప్పుడు క్రింద కంటైనర్ పగిలి ప్రేలుడు సంభవిస్తుంది. అలా ప్రేలినప్పుడు అది మిగిలినవాటికి అధిక వేగాన్నిస్తుంది. వేగం యొక్క త్వరణం కూడా జరుగుతుంది.

ఈ విధంగా అంతరిక్షంలోకి వెళతారు. అలాగే ఇప్పటివరకు జరిగిన భయానక సంఘటనలన్నింటిలో ఎదో పొరపాటు జరుగుతూనే ఉంది, మనం అవాస్తవంలో ఉన్నామని తెలియచేసి మిమ్మల్ని జ్ఞానం వైపుకు నడిపించే  ప్రేలుడు పదార్ధాలు. పర్యావరణ సమస్య, ఎయిడ్స్, మాదక ద్రవ్యాలు వంటి ఆధునిక సమస్యలు మరియు పేదరికం మొదలైనవి ఈ కాలంలో ఉన్న సమస్యలు.మీరు సాక్షీభూతంగా చూస్తే, నిజంగా ఇవన్నీ మన మైండ్ ని దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలుగా గమనిస్తారు. ఇవి చాలా దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. 

మన మైండ్ నిజంగా దిగ్భ్రాంతికి గురి అవ్వాలి. ఈ సమస్య ఎందుకొచ్చింది అని ఆలోచించాలి. కొంతమంది నాయకులు ఈ సమస్యలను ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా పరిష్కరించవచ్చని, ఎక్కువ డబ్బు ఉండడం ద్వారానే ఈ పర్యావరణ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని, మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, వాతావరణాన్ని కలుషితం చెయ్యొచ్చు మరల ఈ డబ్బుతో మనల్ని మనం రక్షించుకోవచ్చు, అందరూ మాస్కులు వేసుకుని సంచరించాల్సి వస్తుంది, కానీ పర్యావరణ సమస్య వచ్చిన పరవాలేదు మనల్ని రక్షించుకోడానికి డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు. అందువలన మీరు పోగలతో నిండియున్న ప్రాంతంలోకి ప్రవేశించే వ్యక్తిలాగా వెళతారు. మనిషి గౌరవాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ తెలివితక్కువ ఆలోచనలన్నీ బయటకు వస్తాయి మరియు మానవులు అన్నింటికన్నా ఉత్తమంగా ఉన్నారని వారు చూడరు.

  మానవులు  యంత్ర పరమైన విషయాలకన్నా, భౌతిక విషయాలకన్నా ఉన్నతంగా ఉన్నారు. వారు యంత్రాల ద్వారా సమతుల్యం చేసేటట్టు మాట్లాడరు, మనిషిని యంత్రానికి ఎక్కువ బానిస చేసే విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే వారికి చాలా డబ్బుకావాలి, ఆ డబ్బుతో వారిని వారు పర్యావరణ సమస్యలనుంచి రక్షించుకోవచ్చని మాట్లాడతారు. ఇది నిరర్ధకం. మానవుని ఆత్మగౌరవాన్ని మనం అర్థం చేసుకునుంటే, మానవుడిగా మనం చేస్తున్న అన్ని అసంబద్ధతలను ఆపడానికి చాలా సానుకూలమైన తెలివైన చర్య తీసుకోవాలి అని మీరు అర్థం చేసుకోవాలి

ఇప్పుడు చాలా ఫ్రెంచ్ తీరాల మాదిరిగా, బీచ్‌లు సహజంగా కలుషితమవుతాయి. ఎందుకంటే వారు సముద్ర తీరంలో హాలిడే మేకింగ్ అనే వెటకారపు పధ్ధతిని మొదలు పెట్టారు కాబట్టి ఇది ఫలితం. కాబట్టి మీరు ఇష్టపడేదాన్ని చేయండి, మీరు ఇవన్నీ చేయలేరు. అది ఆగిపోయింది.మానవును మెదడు ఎలా అయిపోయిందంటే, మనం ఏదో తప్పు చేశామని అర్థం చేసుకోవడానికి బదులుగా, మేము దీనిని శుభ్రపరిచే కొత్త పద్ధతిని ప్రారంభిస్తామని వారు చెబుతారు. వారు ఎప్పటికీ ఖండించరు. ఏ పొరపాటు జరిగిందో ఈ రకమైన  సముద్ర తీరపు వెటకారపు జీవితానికి అంత బానిసలయ్యారు.  ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి, అమెరికాలో ఒక్క లాస్ ఏంజిల్స్ లో 70,000 మంది ప్రజలు వారిని ఈ యుగానికి గొప్పవారుగా చెప్పుకోవడం తెలిస్తే మీరు అమితాశ్చర్యం చెందుతారు.

ఎందుకంటే వారు ఒక పెద్ద విప్లవం లాగా, అసంబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇంత గొప్ప లక్ష్యాన్ని సాధిస్తున్నారు, మరియు వారు చాలా గొప్ప విప్లవకారులు, గొప్ప వ్యక్తులు అని ఆలోచిస్తూ వారు ఈ ఎయిడ్స్ వ్యాధికి మద్దతు ఇస్తున్నారు మరియు దానిని బలపరుస్తున్నారు. ఈ రకమైన వాదన అంగీకరించబడుతుందని మీరు నమ్మగలరా? ప్రజలు దీనిని చూసి నవ్వుతారు. కానీ ప్రతిదీ చాలా డబ్బు ఆధారితమైనది. వారు దానిని ప్రచారం చేయాలనుకుంటున్నారు, వారు డబ్బు సహాయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు, ఇది జరుగుతోందని వారు చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువ డబ్బు ఉంటే వారు ఎక్కువ మందులు తీసుకునేవారు. వారి దగ్గర డబ్బు లేదు కాబట్టే వారు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి వారు మందులు తీసుకోవడానికి మేము వారికి డబ్బు ఇవ్వాలి, లేదా వారు ఈ రకమైన జీవితాన్ని కొనసాగిస్తారు.

గామొత్తంగాచూస్తే, ప్రజలు తమ జీవితకాలమంతా వాస్తవంగా, ఖచ్చితంగా నిజం కాని వాటితో జీవించారు. మేము పొరపాటు చేశామని, ఈ పొరపాటు చేసి ఉండకూడదు అన్న విషయాన్నిఎదుర్కోవలసి వచ్చినప్పుడు వాళ్ళు మరళ ప్రయత్నిస్తారు. మేమే గొప్పవాళ్ళం మరియు మేమే అధికులం అనే మరొక అద్భుతమైన చిత్రాన్ని కృత్రిమంగా మరియు అవాస్తవంగా తీసుకుంటాను. దీన్నే కలియుగం అంటారు. ఈ యుగంలో అజ్ఞానంతో ఉన్న ప్రతిదీ, అసహ్యించుకోవలసిన ప్రతిదీ, రక్షణ ఉండాల్సిన ప్రతీదీ సాధించడం ప్రజల లక్ష్యం అవుతుంది.  

మన చుట్టూ ఉన్న పరమ చైతన్యం యొక్క శక్తే సహజయోగా చేస్తుందని, అదే మిమ్మల్ని సహజయోగాకి తీసుకువచ్చిందని, అదే మీకు ఆశీస్సులనిచ్చిందని మీకు అర్ధమయ్యే ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రార్ధన ఏమిటంటే మనం పరమ చైతన్యంలో భాగమని మరింత బాగా తెలుసుకోవాలి.  మరియు ఆ శక్తిని మనం ఉపయోగించుకోగలమని మనం అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతిని గనక ఈరోజే పొందినట్లైతే ఇప్పటికే చాలా పని జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇందుకొరకై దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు, దయచేసి మీరు నన్ను పరమ చైతన్యగా ఆరాధిస్తున్నారని గుర్తుంచుకోండి. అందువల్ల మీరు వాస్తవంతో స్వయంగా వ్యవహరిస్తున్నారు. ఆ అవగాహనతో మీరు ఈ పూజ చేయాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి.

– పరమ పూజ్య శ్రీ మాతాజీ శ్రీ నిర్మలా దేవి.