
Enjoying The Joy San Diego (United States)
మానవాతీత అవగాహన : ఇంత ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి…ఇలా జరుగుతూ ఉంటుంది, ఎం జరిగినా మనం అంగీకరించాలి, దైవం అలా జరిపిస్తుంటుంది. ప్రతిదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు, మనలో ఏ శక్తి కేంద్రాలున్నాయో వారు మీకు వివరించగలిగుండాలి, మరియు మనలో వాటి నిర్మాణం/పనిచేసే విధానం ఎలా ఉన్నదో అతను మీకు వివరించారు. ఇవన్నీ మన పరిణామం యొక్క వివిధ కాలాల్లో నిర్మించబడ్డాయి. ప్రతీ శక్తి కేంద్రం అలానే నిర్మింపబడింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మార్గం వలే నిర్మింపబడ్డాయి. ఎడమ మరియు కుడి మార్గాల ద్వారా మీరు మీ ఉన్నతికి కావాలసిన మధ్య మార్గమును సృష్టిస్తారు. మీ శుద్ధ ఇచ్ఛ యొక్క శక్తి ఉద్దానం అయ్యి, జాగృతి చెంది, ఏడవ శక్తి కేంద్రం నుంచీ చొచ్చుకుని పోతుంది, దాన్నే సహస్రారం అంటాము, అంటే, వెయ్యి రేకుల శక్తి కేంద్రం – మెదడు, లేదా మెదడులో లింబిక్ ని కప్పే కొంత భాగం. పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ . అది మన హృదయంలో నివసిస్తుంది. ఎప్పుడైతే కుండలిని ఆత్మయొక్క పీఠమైన సహస్రారాన్ని తాకుతుందో, అది హృదయంలో ప్రతిబింభించి, జ్ఞానోదయం పొందుతుంది. దీని అర్థం ఆత్మ జ్ఞానోదయం పొందుతుందని అర్థం కాదు. ధ్యాస అన్నది ఒక చీర లాంటిది, అది పైకి ఇలా (శ్రీమాతాజీ వీడియోలో చూపిస్తారు) నెట్టివేయబడి, తాకి, సహస్రారంలో పీఠం కలిగిన, హృదయంలో ఉన్న ఆత్మను ప్రభావితం చేసి మన కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించటం మొదలుపెడుతుంది. కాబట్టి, మీ తలపై చల్లటి గాలి రావటమనేది మీకు కలిగే మొదటి అనుభూతి. మీకు కలిగే రెండవ అనుభూతి: సర్వ వ్యాపకమైన శక్తి, అదే పరమ చైతన్యం. ఇప్పుడు మీరు మీ అవగాహన యొక్క సూక్ష్మ స్థితిలోకి ప్రవేశించారు. మొదట మానవ అవగాహన పెరుగుతుంది, కానీ ఎప్పుడైతే మీరు మీ ఆత్మను తాకుతారో/తెలుసుకుంటారో, ఆలోచనా రహితమైన అవగాహనను పొందుతారు. కానీ ఆలోచన ఉండదు, స్థూలం/భౌతికం పోతుంది, ఆలోచనలు మాయమవుతాయి. మీరు సూక్ష్మంగా మారతారు. ఈ సూక్ష్మత మీకు కొన్ని శక్తులను ఇస్తుంది. మీ అవగాహన సమిష్టి స్పృహలోకి Read More …