Talk, Eve of Shri Vishnumaya Puja YWCA Camp, Pawling (United States)

ప్రశ్న : శ్రీమాతాజీ, మాలో చాలామందికి హంస చక్రం గురించి తెలియదు, హంస చక్రంకు మరియు విశుద్ధికి గల సంబంధం మరియు విశుద్ధి చక్రమును బలోపేతం చేయడానికి మేము ఏమి చెయ్యాలో వివరించండి.శ్రీమాతాజీ : హంస చక్రం, విశుద్ధి చక్రానికి మరియు ఆజ్ఞా చక్రానికి మధ్య ఉండడం మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. విశుద్ధి నుంచి చాలా నరాలు హంస దగ్గర ఆగిపోతాయి, అవి మెదడు వరకు వెళ్లవు. ఇక్కడ మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలుగా పిలవబడే ప్రతిచర్యలన్నీ ఆగిపోతాయి. నాకు మురికి వాసన వచ్చిందనుకోండి ముక్కు మూసుకుంటాను, వినకూడనిది వింటే చెవులు లాగుతాను, ఏదైనా చూడకూడనిది చుస్తే నా కళ్ళు వాటికవే మూసుకుంటాయి. ఎవరైనా సూదితో/పిన్నుతో గుచ్ఛటానికి దగ్గరకి తేగానే ఆకస్మికంగా నేను నా చేతిని వెనక్కి తేసేస్కుంటాను. ఇవ్వనీ నా శరీర వ్యవస్థలోనే నిర్మించబడ్డాయి. మీరు కూడా మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలతోనే ప్రతిస్పందిస్తారు.                                  జంతువులు వేరు, జంతువులకు ఇలాగే జరగకపోవచ్చు, కొన్ని జంతువులకు కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉన్నాయి, మరికొన్ని జంతువులకు వేరేవి ఉన్నాయి. మనము వేరు, మనందరికీ దాదాపు ఈ చర్యలన్నీ ఒకేలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు, అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. వారి వారి నియమాల ప్రకారం ఒకరు “యాహ్” అంటారు, మరొకరు “ఓహ్” అంటారు, మరొకరు మరొకవిధంగా అనవచ్చు. కానీ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఒకేవిధంగా ఉంటాయి.              కాబట్టి అసంకల్పిత ప్రతీకార చర్యలకు మనం విచక్షణను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే రెండు నాడులు కలుస్తున్నాయో, ఆ కలిసే చోటును ఉపయోగించుకుంటున్నప్పుడు ఆజ్ఞాకి వెళ్లకుండా హంస చక్రం యొక్క పని(విచక్షణ) మొదలవుతుంది. అందువలన ఈ రెండు నాడులు కలిసినప్పుడు మన అనుభవాల ద్వారా పరిస్థితిని చూడటం ప్రారంభిస్తాము. మొదటిది స్వాంచాలికమైన ప్రతిచర్య, రెండవది అనుభవాల ద్వారా చూడటం : ఒక పిల్లవాడిని  “ఇక్కడ వేడిగా ఉంది నువ్వు చెయ్యి పెట్టవద్దు” అని అన్నారనుకోండి, వినడు. పిల్లవాడిని ఆలా వదిలేస్తే, కాలినప్పుడు అతని అనుభవం ద్వారా ప్రతిచర్యలు మరియు వాటి నియమ నిబంధనలు/కండీషనింగ్స్ వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి ప్రతిచర్యలు మనలో నిర్మింపబడతాయి. మీరు గమనించినట్లయితే, జాతి వివక్ష ఉన్న దేశానికి లేదా Read More …