Talk, Eve of Shri Vishnumaya Puja

YWCA Camp, Pawling (United States)

Feedback
Share
Upload transcript or translation for this talk

ప్రశ్న : శ్రీమాతాజీ, మాలో చాలామందికి హంస చక్రం గురించి తెలియదు, హంస చక్రంకు మరియు విశుద్ధికి గల సంబంధం మరియు విశుద్ధి చక్రమును బలోపేతం చేయడానికి మేము ఏమి చెయ్యాలో వివరించండి.
శ్రీమాతాజీ : హంస చక్రం, విశుద్ధి చక్రానికి మరియు ఆజ్ఞా చక్రానికి మధ్య ఉండడం మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. విశుద్ధి నుంచి చాలా నరాలు హంస దగ్గర ఆగిపోతాయి, అవి మెదడు వరకు వెళ్లవు. ఇక్కడ మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలుగా పిలవబడే ప్రతిచర్యలన్నీ ఆగిపోతాయి. నాకు మురికి వాసన వచ్చిందనుకోండి ముక్కు మూసుకుంటాను, వినకూడనిది వింటే చెవులు లాగుతాను, ఏదైనా చూడకూడనిది చుస్తే నా కళ్ళు వాటికవే మూసుకుంటాయి. ఎవరైనా సూదితో/పిన్నుతో గుచ్ఛటానికి దగ్గరకి తేగానే ఆకస్మికంగా నేను నా చేతిని వెనక్కి తేసేస్కుంటాను. ఇవ్వనీ నా శరీర వ్యవస్థలోనే నిర్మించబడ్డాయి. మీరు కూడా మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలతోనే ప్రతిస్పందిస్తారు.
                                  జంతువులు వేరు, జంతువులకు ఇలాగే జరగకపోవచ్చు, కొన్ని జంతువులకు కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉన్నాయి, మరికొన్ని జంతువులకు వేరేవి ఉన్నాయి. మనము వేరు, మనందరికీ దాదాపు ఈ చర్యలన్నీ ఒకేలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు, అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. వారి వారి నియమాల ప్రకారం ఒకరు “యాహ్” అంటారు, మరొకరు “ఓహ్” అంటారు, మరొకరు మరొకవిధంగా అనవచ్చు. కానీ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఒకేవిధంగా ఉంటాయి.
              కాబట్టి అసంకల్పిత ప్రతీకార చర్యలకు మనం విచక్షణను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే రెండు నాడులు కలుస్తున్నాయో, ఆ కలిసే చోటును ఉపయోగించుకుంటున్నప్పుడు ఆజ్ఞాకి వెళ్లకుండా హంస చక్రం యొక్క పని(విచక్షణ) మొదలవుతుంది. అందువలన ఈ రెండు నాడులు కలిసినప్పుడు మన అనుభవాల ద్వారా పరిస్థితిని చూడటం ప్రారంభిస్తాము. మొదటిది స్వాంచాలికమైన ప్రతిచర్య, రెండవది అనుభవాల ద్వారా చూడటం : ఒక పిల్లవాడిని  “ఇక్కడ వేడిగా ఉంది నువ్వు చెయ్యి పెట్టవద్దు” అని అన్నారనుకోండి, వినడు. పిల్లవాడిని ఆలా వదిలేస్తే, కాలినప్పుడు అతని అనుభవం ద్వారా ప్రతిచర్యలు మరియు వాటి నియమ నిబంధనలు/కండీషనింగ్స్ వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి ప్రతిచర్యలు మనలో నిర్మింపబడతాయి. మీరు గమనించినట్లయితే, జాతి వివక్ష ఉన్న దేశానికి లేదా కుల వ్యవస్థ ఉన్న మన దేశానికి సంబంధించిన వ్యక్తి వారి బాల్యం నుండి నేర్చుకున్న అనుభవాల ప్రకారం స్పందిస్తాడు. ఈ నిబంధనలన్నీ మీరు పుట్టినప్పుడు ఆరోజుకు ఉన్నవి కావచ్చు.  క్రిందటి జన్మలో మీరు ఆఫ్రికాలో జన్మించారనుకుందాం, ఈజన్మలో తెల్లటి చర్మంతో పుట్టడం వల్ల మీరు నల్లటి చర్మం ఉన్నవారిని ఆఫ్రికన్ అని పిలవటం ప్రారంభించారు.  

మీ మనసు యొక్క శిక్షణ ద్వారా ఈ నిబంధనలన్నీ మీ హంస చక్రంలో నిర్మింపబడతాయి. మీ మనసు యొక్క అనుభవాలు, సమాజంలోని అనుభవాలు, మీ జ్ఞానం ద్వారా, మీ విద్య ద్వారా మీరు చెప్పే విధానం బట్టి హంస చక్రంలో నిర్మింపబడతాయి మరియు అది అర్థం లేని విషయాలకు కూడా ప్రతిస్పందిస్తుంది. ఎవరో నీలం రంగు జీన్ ప్యాంటు వేసుకోవటంవల్లో, ఆకుపచ్చ షర్ట్ వేసుకోవటంవల్లనో నేను ఆ వ్యక్తిని అసహ్యించుకున్నాను, అది మీ మనసులలోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ప్రేమలో పడటం కూడా అదే నిబంధనల నుండి వస్తుంది. మీరు కలుసుకున్న వ్యక్తికి నీలి కళ్ళు ఉండి, ఆ వ్యక్తి మీ మీద దయ చుపించారనుకుందాం, కాబట్టి నీలి కళ్ళు ఉన్న వ్యక్తిపై మీకు మొహం కలుగుతుంది. ఇక్కడ అందం గురించి స్వచ్ఛమైన ఉద్దేశ్యం లేదు. ఆనందం గురించి స్వచ్ఛమైన ఆలోచన లేదు. సౌందర్యం/రసజ్ఞత గురించి స్వచమైన ఉద్దేశ్యం లేదు. అంతా నియమనిబంధన/కండిషన్. కొంతమందికి అందంగా అనిపించింది మరికొంతమందికి అందంగా అనిపించదు. కాబట్టి ఈ పరస్పర మార్పిడి రెండు నాడుల మధ్య ప్రదేశంలో జరుగుతుంది. హంస చక్రం కుండలిని మార్గం బయట ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా అవి కుండలిని మార్గం వదిలి హంస చక్రానికి వస్తాయి. కుండలిని కదిలినప్పుడు, విశుద్ధి నుంచే నేరుగా ఆజ్ఞాకి వెళుతుంది. ఇప్పుడు మనం హంస చక్రాన్ని ఎలా మెరుగుపరుచుకోగలం? ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే హంస చక్రంగానీ పాడయితే, నియమ నిబంధనలు/షరతులు ఎక్కువైపోతాయి. కుండలిని పనిచేయకుండా వదిలేస్తుంది. హంస చక్రంను బాగు చెయ్యటానికి మనం భౌతిక వస్తువులను ఉపయోగిస్తాము. నేను చెప్పినట్లు ముక్కులో నెయ్యి వేసి సరిగ్గా పోషించాలి. ఎందుకంటే కుండలిని హంసపై ఎక్కువగా దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తే, దానికి సమస్య వస్తుంది. సమస్య ఎందుకంటే, మీరు హంస యొక్క ఎపిథీలియల్ / ఉపతల కణాలు మరియు పొరలు ఎండిపోయే విధంగా సమయాన్ని గడుపుతారు. కుండలిని ఉద్ధానం జరిగినప్పుడు ఆ హంస దగ్గర పొడితనం వల్ల హంసకి ఇంకొంచెం సమస్య కలగవచ్చు. అందువలన హంస కుండలిని మార్గం బయట ఉంచబడుతుంది. కానీ హంస యొక్క కాంతి బయట ఉన్నప్పటికీ ఈ కాంతి యొక్క ప్రభావం లోపలకు పడుతుంది.     
కనుక కుండలిని మీ హంస చక్రాన్ని నేరుగా ప్రభావితం చేయదు. ఎలా అంటే, కుండలిని జాగృతి చెందినప్పుడు, ఆ మనిషి తెలుపు రంగా, నలుపు రంగా, మనిషా అన్నది మీకు మీరుగా చూస్తారు. మీరు కారణం చూపిస్తే హంస చక్రం శుభ్రపరుస్తుంది. అప్పుడు మీరు ఓ, నేను అహంభావంతో ఉన్నాను అని మీరు గ్రహిస్తారు. మీరు మిమ్మల్ని ఆజ్ఞా ద్వారా చూడటం ప్రారంభిస్తారు, అప్పుడు ఓ, నేను చాలా నియమ నిబంధనలతో ఉంటున్నాను అని గ్రహిస్తారు. ఈ కారణాలు చూసి, మీ నియమ నిబంధనలను సరి చేసుకుంటారు. ఇదే హంస చక్రం.
                  ఆత్మ సాక్షాత్కారం పొందటంవల్ల హంస చక్రం శుభ్రపడదు. కానీ ఇది కుండలిని జాగృతి యొక్క లక్షణం మరియు ప్రభావం మాత్రమే. కుండలిని జాగృతితో విచక్షణ పెరుగుతుందని కొంతమంది అనుకుంటారు. అది తప్పు అవగాహన. మీలో మీరు ఉద్దేశ్యపూర్వకంగా విచక్షణను పెంచుకోవాలి.  కానీ ఒక్కసారి పెరిగాక, ఉదాహరణకు నా విచక్షణ పరిపూర్ణమైనది. అదేంటో నాకు తెలుసు, నా నియమనిబంధనలన్నీ పరిపూరమైనవని మీకు తెలుసు.  కుండలినితో, వాస్తవంతో కలిసిపోతుంది. కానీ మానవులకు అర్థం చేసుకోవడం ద్వారా ప్రతిబింభించాలి. ఎలా అంటే, ఒక పిల్లవాడు వేడిగా ఉన్నది తాకినట్లైతే, అది వేడిగా ఉన్నట్లు గ్రహించినట్లు. ఇది వేడెక్కి ఉంది కాబట్టి వేడిగా ఉందని అర్థం చేసుకుంటాడు.  
                       ఒక వ్యక్తి యొక్క కుడి హృదయం పట్టుకున్నట్టు మీరు గమనిస్తే, అతనికి పలానా ఇబ్బందులున్నట్లు మీకు మీరే మీ చేతులలో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తితో, “మీరు ఆస్తమాతో బాధపడుతున్నారా?” అని అడిగితే.
అతను, “అవును, మీకు ఎలా తెలుసు?” అని అడుగుతాడు.
“నాకు తెలుసు ఎందుకంటే నేను మండుతున్న నా వేలు ద్వారా నేర్చుకున్నాను, అందుకే నాకు తెలుసు.” అని అంటారు.
            ఎవరికైనా ఉబ్బసం ఉందని అనుకుందాం మరియు అందులో మీ కుండలిని భాగం అయినట్లయితే, మీకు వెంటనే ఉబ్బసం వస్తుంది. మీకు ఈ విషయం తెలుస్తుందా ? మన తర్కము మరియు అవగాహన ద్వారా వెళ్లనంతవరకు నియమనిబంధన/కండిషనింగ్ మనలను చేరలేదు.  మీకు అర్థం అవుతుందా ? ఇది పని చేయదు. కారణం ఇది మీ సామూహిక స్పృహను వడకడుతుంది. లేదంటే, మీరు ఎయిడ్స్ ఉన్న వ్యక్తి దగ్గరకు వెళితే, మీరు అతనికి ఎయిడ్స్ ఉన్నట్లు సమిష్టి స్పృహలోకి వెళతారు. మీ నియమనిబంధనల మాదిరిగా అన్నీ ఇముడ్చుకుంటే / నిమగ్నం అయితే మీరు దాన్ని పొందుతారు. కానీ మీరు విడిపోయారు. దీని గురించి జెరోమ్ రాసిన ఒక మంచి కధ ఉంది. ఒకతను డాక్టర్ దగ్గరకు వెళ్లి.
డాక్టర్ “నాకు ‘గృహిణి యొక్క మోకాలి వ్యాధి(housewife’s knee ) “తప్ప అన్ని వ్యాధులు ఉన్నాయి”  
డాక్టర్ : “మీకెందుకు రాలేదు ఆ వ్యాధి”
అందుకు ఆ వ్యక్తి ” ఎందుకంటే నేను గృహిణిని కాదు”
అతడి అన్ని వ్యాధులకు నియమనిబంధనలు ఉన్నాయి.  ఆవిధంగా చాలా మందికి వ్యాధులు వస్తాయి. కానీ భగవంతుని దయవలన మనకి ఫిల్టర్ ఉంది. ఎవరికైనా వ్యాధి ఉంటె, మీకు అది రాదు. ఎందుకంటే మీరు దాన్ని ఫిల్టర్ చేయగలరు.
       కానీ హంస చక్రం బాధల ద్వారా ప్రభావితం అవుతుంది. ఏదైనా బాధ ముక్కుద్వారా హంసకు చేరినా, ఏదైనా వైరస్ / సూక్ష్మ జీవి చేరినా ప్రభావితం అయ్యి చక్రం పాడవుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఈ రెండిటి మధ్య విచక్షణ ఉండాలి. బయట వైరస్/సూక్ష్మ క్రిమి సంక్రమణ ఉందనుకుందాం. అది మీ హంస చక్రంలోనికి వెళ్లి సైనస్ అనే వ్యాధిని గానీ మరేదైనా వ్యాధులను కలిగించవచ్చు. ఇది భౌతికమైనవి. కానీ మీకు ఏ వ్యక్తి నుంచి వైరస్ వచ్చిందో ఆ వ్యక్తికి ఉన్నంత బాధ పడరు ఎందుకంటే అక్కడ ఫిల్టర్ ఉంది. మీరు ఒక తీవ్రమైన వ్యక్తి తో సంభాషించవలసి వచ్చిందనుకోండి, అది మీ స్వాధిష్టానా తీసుకుంటుంది. మీరు కూడా ఆ వ్యక్తితో తీవ్రతరం అవ్వొచ్చు. కానీ, హంస విషయానికి వస్తే, మీరు ఎవరితో ఉన్నా, ఫిల్టర్ వల్ల మిగతా చక్రాల లాగా  హంస పూర్తి ప్రభావితం చెందదు.
        అందువలన  ఇప్పుడు మీరు విచక్షణను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తే, మీరు నేర్చుకుని అర్థం చేసుకోవాలి. ఇది దానికదే  వెంటనే రాదు. కానీ ఏ పిల్లలైతే ఆత్మసాక్షాత్కారంతో పుడతారో, వారి హంస చక్రం ఎలా అభివృద్ధి చెంది ఉంటుందంటే, వారికీ ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసు. ఎందుకంటే వారి హంస చక్రం ఆ విధంగా శిక్షణ పొందటం వలన ఎక్కువగా అర్థంచేసుకోనవసరం లేదు. కానీ ఇపుడు పెరుగుతున్న వారు, సహజయోగులు తమ సొంత అనుభవాల ద్వారా వారి హంసను తెలుసుకోవాలి. చిన్న పిల్లవాడికి ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసు. ఎందుకటే, ఆ పిల్లవాడి హంస వృద్ధి చెంది ఉంది. భారత దేశంలో శిశువు పుట్టగానే చక్కగా మర్దనం చేస్తారు. మంచి హంస ఉండడానికి నూనె వేయడం ఉత్తమమైన మార్గం. నూనెను వారి జుట్టుకు, శరీరానికి, కొన్ని చుక్కలు ముక్కులో వేస్తారు. చెవిలో, మరియు ముక్కులో వేయడం వల్ల అవి ఏర్పడతాయి.
              కాబట్టి శారీరకంగా మీరు నెయ్యి వాడటం ద్వారా మంచి హంసను కలిగి ఉంటారు, విషయాలను నేర్చుకోవడం, అనుభవాల (ఏమి చేయాలి, ఎలా చెయ్యాలి, ఎలా పని చేయాలి, ఎలా నియమించాలి) ద్వారా మానసికంగా మంచి హంసను కలిగిఉంటారు. ఆ విధంగా హంస చక్రం వృద్ధి చెంది మిమ్మల్ని విచక్షణాపరులుగా చేస్తుంది. అందుకే సంప్రదాయం చాలా ముఖ్యం. సంప్రదాయం మీకు హంస యొక్క అభివృద్ధినిస్తుంది, పొరపాట్లను తొలగిస్తుంది. మీరు ఏది మంచిదో అదే ఉంచుతారు. ఆ సంప్రదాయాన్ని మీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు  ఇస్తారు. కాబట్టి సంప్రదాయాలు లేని వ్యక్తి కంటే, సాంప్రదాయకంగా పెరిగినవారి విచక్షణ వస్తుంది.
                  ఉదాహరణకు పశ్చిమదేశాల్లో ప్రజలు వాష్ బేసిన్ ను నింపి తీసుకునే విషయమై సంభాషిస్తున్నాను. భారత దేశంలో ఇలా చేయలేము. దాని గురించి ఆలోచన కూడా చేయలేము. ఇలా చేయవచ్చని ప్రజలకు తెలియదని నా ఉద్దేశ్యం. ఎందుకంటే, సంప్రదాయంగా, మీరు మీ ముఖాన్ని కడుక్కున్న నీరు మళ్ళా వాష్ బేసిన్ లో పడినప్పుడు, మురికి అంతా మిగతా నీటిలో పడుతుంది. మళ్ళా అదే నీటిని ఉపయోగించడం వలన మీరు ఆ పనిని పూర్తి  చేయలేరు. కాబట్టి ఎల్లప్పుడూ పారుతున్న నీటిని ఉపయోగించండి. సంప్రదాయంలో ఇది మేము  నేర్చుకున్నాము. అందువలన ఇది మా తలలో ఉంది, మా విచక్షణలో ఉంది. అలాంటి దాని గురించి ఆలోచనకూడా చేయలేము.
               మూలాధారాను శుభ్రం చేసి కడగాలి అన్నది చాలా సాధారణ విషయం.  ఏ భారతీయుడినైనా , మీరు తీసుకోండి, ఈ విషయం అతనికి తెలుసు, ఎందుకంటే వారికి ఇంతకు ముందు కొన్ని సమస్యలు ఉండాలి. అతను ఉత్తరాన ఉన్నా, దక్షిణ, తూర్పు లేదా పడమరలో ఉన్నా – అతనిని అడగండి. మరొక విషయం ఇలా శుభ్రం చేసుకోవటమనేది చాలా శుభప్రదమైనది.  ఇది సంప్రదాయంలో చాలా నిమగ్నమై/ఇమిడి ఉంది. కొన్ని సంప్రదాయాల్లో అసంబద్ధమైన పనులు చేస్తారు, అలాంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. చాలా ప్రాచీనమైన వ్యక్తులవలె అన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి. మీరు లడఖ్ కు వెళ్ళినట్లైతే, అక్కడ చనిపోయిన వారి చేతిని ఇంట్లో ఎప్పుడూ ఉంచుతారు. అది సహాయపడుతుందని వారు భావిస్తారు. సంప్రదాయంలో పొరపాటు ఉంటె దాన్ని వదిలివేయడం ద్వారా అది తప్పు అని తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఎంత సంప్రదాయకమైనవారు అయితే, ఎంత పురాతనమైన వారు అయితే అన్ని విషయాలు నేర్చుకుంటారు.
           మనం చూసినట్లు, ఇంగ్లీష్ వారు ఒక రకంగా చాలా సాంప్రదాయకమైనవారు. ఒక స్త్రీ మెట్లు దిగుతూ కిందకి వెళుతుందనుకుందాం. పురుషుడు కూడా ఆమెతో పాటే ఉంటె, స్వయంచాలకంగా/ ఆటోమాటిక్ గా అతను ముందుంటాడు. ఒకవేళ ఆ స్త్రీ మెట్లెక్కి పైకి వెళుతున్నటైతే అతను వెనుక అనుసరిస్తాడు. స్వయంచాలకంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు దిగిపోతుంటే ఆ స్త్రీ పడిపోవచ్చు లేదా మరేదైనా కావచ్చు కాబట్టి మేము ముందు ఉండాలి అని సాంప్రదాయకంగా వారు తెలుసుకున్నారు.  ఒక వ్యక్తి యొక్క సాంప్రదాయక అలవాట్లన్నీ హంసకు చేరవేయబడతాయి. కాబట్టి ఈ అలవాట్లు ఆచరించి తప్పొప్పులను తెలుసుకోవటం ద్వారా మెరుగ్గా మరియు మంచిగా నిర్మించబడతాయి. ఆ రకంగా దీన్ని మీరు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు సహజయోగులైన వారికి దీన్ని ఇమడ్చడం చాలా సులభం, ఎందుకంటే, మీరు ఏదైనా పొరపాటును చూస్తే, అవును ఇది తప్పు అని అది చేయకుండా ఉండటమే. అంతే, పని అయిపోయినట్లే. కానీ ఆ నిర్ణయం తీసుకోవటంలో మీరు చాలా స్పష్టంగా ఉండాలి. ఇది పని చేస్తుంది. మీ హంస బాగుంటుంది. ఎవరికైనా వద్దని పదిసార్లు చెప్పినా మళ్ళా అదే పని చేస్తుంటే దానికర్ధం వారి హంస చక్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదని అర్థం. హంస చక్రాన్ని  పోషించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, నేను చెప్పినట్లు కాటుక కూడా హంస చక్రానికి చాలా మంచిది. కాటుక, ముక్కులో, చెవుల్లో నూనె ఇవన్నీ హంస చక్రానికి చాలా మంచిది.  ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా, విచక్షణతో మాట్లాడటం ఆంటే, ఆ వ్యక్తిని ప్రభావితం చేసే శక్తిని కోల్పోకుండా చెప్పటం. ఎలా ఆంటే, మీరు ఒక వ్యక్తితో చాలా కఠినంగా ఏదైనా చెప్పారనుకుందాం. మీరు దాన్ని ఎలా తటస్తం/ న్యూట్రలైజ్ చెయ్యాలో తెలుసుకోవాలి. తద్వారా అతను దానిని(తటస్థ వైఖరిని) తనలో ఉంచుకుంటాడు.
 ఈ విచక్షణలన్నీ సంప్రదాయం ద్వారా మాత్రమే వస్తాయి. మీరు ఎదో వ్యర్థమైనదాన్ని కనుగొన్నప్పుడు, సంప్రదాయంలో సమిష్టి ద్వారా పడిపోతుంది. కాబట్టి సంప్రదాయం యొక్క ఆశీర్వాదం గొప్పదే, కానీ మీ ఆత్మ యొక్క ఆశీర్వాదాలు ఇంకా గొప్పది. ఆత్మ యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, మీలో ప్రవహిస్తున్న పరమ చైతన్యం ద్వారా వెంటనే ఇది తప్పు అని తెలుసుకుంటారు. కానీ మీరు చాలా నిజాయితీగా ఉండాలి, తప్పు అని తెలిసిన వెంటనే దాన్ని వదిలివేయాలి. మీరు ఉన్నతిని సాధించాలనుకుంటున్నారు, మీ పరమచైతన్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. అందువలన దానికోసం మీరు ఏమైనా చేస్తారు. 

                                  – పరమ పూజ్య శ్రీ మాతాజీ శ్రీ నిర్మాలా దేవి