Paramchaitanya Puja Taufkirchen (Germany)

ఈ రోజు మనం ఏ పూజ చేయబోతున్నాం అని నన్ను అడిగారు. నేను దానిని రహస్యంగా ఉంచాను. ఈ రోజు మనం పరమ చైతన్యమును ఆరాధించాలి. అదే అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క ప్రేమ. పరమ చైతన్యము దయతో ప్రతిదీ పనిచేస్తుందని మనందరికీ తెలుసు, కనీసం మానసికంగా అయినా తెలుసు. ఇదే ఆదిశక్తి యొక్క శక్తి. కానీ ఇప్పటికీ ఈ విషయం మన హృదయంలో గానీ, మన ధ్యాసలో కానీ అనుకున్నంతగా లేదు. ఒక మహా సముద్రము వలె పరమ చైతన్యము అంతటినీ తనలో కలిగి ఉన్నది. ప్రతిదానికి, పని చేసే ప్రతీ దానికీ స్వంత పరిమితులు ఉంటాయి. అందువలన పరమ చైతన్యమును దేనితోనూ పోల్చలేము. సూర్యుడిని గమనిస్తే, కొన్ని పనులు జరగాలంటే సూర్యుడి ద్వారా వర్షాలు రావాలి. అధికారంలో ఉన్న ఒక వ్యక్తిని గనక మీరు చూస్తే, బయటికి అతను తన అధికారాన్ని/శక్తిని చూపించాలి.  కానీ అతను లోపల అలా అధికారాన్ని చూపించడు. ఉదాహరణకి ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనం లో ఒక వృక్షం పెరుగుతుంది, ఫలాలు వస్తాయి, వాటిని అమ్ముతారు, ప్రజలు వాటిని తింటారు. ఇదంతా ఆ విత్తనంలో ఉన్నది. అదే పరమ చైతన్యము.  మనందరం అందులోనే నిబిడీకృతం అయి ఉన్నాము. మనం చూసేది అలలను మాత్రమే. మనం ఆ అలలమీద ఉన్నట్లు చూస్తే, స్థానభ్రంశం చెందినట్లుగా, వేరు చేయబడినట్లుగా కనిపిస్తుంది. సరిగ్గా, ఇది జర్మనీ, ఇది ఇంగ్లాండ్, ఇది భారత దేశం అని మనం భావిస్తున్నట్లే ఉంటుంది. ఇవి పరమ చైతన్యపు చీర యొక్క మడతలు. అవి బయటికి వేరుగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అవి వేరుగా లేవు, అవి అన్నీ కలిసే ఉన్నాయి. అందువలన అవి ఖచ్చితంగా పూర్తిగా అనుసంధానించబడి ఉన్నాయి.  నేను గనక ఒక దారపు పోగును చీర నుండి లాగితే, మొత్తం దారపు పోగు చీర నుంచి లాగివేయబడుతుంది. అలాగే పరమ చైతన్యం తనలో తానే పనిచేస్తుంది. పరమ చైతన్యం లేకుండా ఏమీ లేదు. అందువలన సహజయోగులైన మీ మీద పరమ చైతన్యం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.  లేదా అది  మీతో ఖచ్చితంగా మమేకం అవుతుంది అని చెప్పాలి. మీరు పరమచైతన్యంతో మమేకం అయినప్పుడు  మీరు ఏది కోరుకున్నా, ఏది కావాలనుకున్నా అది కూడా పరమచైతన్యం నుండే లభిస్తుంది. అల్ల కల్లోలంగా ఉన్న సముద్రంలో కొన్ని నీటి బిందువులు గాలిలోకి ఎగిరి అవి సముద్రముకంటె పైన Read More …