Birthday Puja: Sincerity

Curzon Hall, Sydney (Australia)

Feedback
Share
Upload transcript or translation for this talk

 మిమ్మల్ని చూసుకోవటానికి, మీ కోసం శ్రద్ధ వహించడానికి మరియు చాలా జ్ఞానంతో మిమ్మల్ని మార్చగలిగే తల్లి మీకు అవసరం. సహజయోగులు కూడా వారి హృదయాలను విస్తరించుకుంటూ, వారు ఇక నీటి బిందువులు కాదని,  సముద్రంలో భాగం అని వారు గ్రహిస్తున్నట్లు నేను తెలుసుకుంటున్నాను. ఆ సముద్రమే వారిని బలోపేతం చేస్తూ, పోషిస్తూ వారిని చూసుకుంటుంది. అదే సముద్రం వారికి మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ నీటిబిందువులు మరియు సముద్రం యొక్క అనుసంధానం పూర్తిగా ఏర్పడాలి. అప్పుడు నీటి బిందువు యొక్క పరిమితులు సముద్రం యొక్క గొప్పతనంలో పూర్తిగా కరిగిపోతాయి. ముందుగా, సమిష్టి( కలెక్టివిటీ) గా ఉండాలనే నిజమైన కోరిక, శ్రద్ధ మరియు మంచి విషయాలు చెప్పటం ద్వారా సమిష్టి ని మెరుగుపరచవచ్చు. సమిష్టిగా ఉండాలి అన్న కోరిక నిజాయితీగా ఉండాలి. ఇది మీ ఉనికి యొక్క విస్తరణకు సహాయపడుతుంది. మొదట కావలసింది మీకు మీరు నిజాయితీగా ఉండటం. మనం చిన్న నీటిబిందువు నుంచి రావటంవల్ల మళ్ళా మళ్ళా ఆ బిందువు యొక్క పరిమితుల్లోనే ఉండిపోతామనుకోండి, కానీ మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారనే ముందు చూపు ఉండాలి. అందువల్ల మీరు సమిష్టిగా ఉండాలనుకుంటున్న ఆలోచనకు చిత్తశుద్ధి/నిజాయితి అన్ని అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. మీరు గనక ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవటానికి నిజాయితీగా ప్రయతిస్తున్నట్లైతే  సమయాన్ని, రోజుని మరియు అన్నీ మరిచిపోతారు. అవి చిన్నవి అయినా మీరు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీకు ఆ నిజాయితీ ఎక్కడ నుంచి వస్తుంది? నిజాయితీని ఆచరణలో పెట్టాలంటే రెండు విషయాలున్నాయి. మొదట మీకు మీరుగా తెలుసుకోవలసినది – సహజయోగా అంటే ఏమిటి? సహజయోగ మీకు ఏమి ఇచ్చింది? సహజయోగ మీకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చింది, విస్తృతమైన దృష్టిని ఇచ్చింది, సామూహిక చైతన్యాన్ని ఇచ్చింది, ఆలోచనారహిత స్థితికి ఇచ్చింది, నిస్సందేహస్థితిని ఇచ్చింది, మీ నుండి కొత్త వ్యక్తిత్వాన్ని సృష్టించింది. సరిగ్గా గ్రుడ్డు పక్షిగా మారినట్లు. ఇప్పుడు మీరు పక్షి అయినారు. సహజయోగ మీకోసం ఏమి చేసిందో, దానితో మీరు ఏమి సాధించారో గ్రహించాక, మరలా గ్రుడ్డు స్థితికి మీరు వెళ్ళలేరు.       మీరు జ్ఞానాన్ని సాధించారు. కుండలిని జ్ఞానం. ఈ జ్ఞానం ఇన్ని సంవత్సరాలుగా రహస్యంగా ఉంచబడింది. ఇది ఖచ్చితంగా రహస్య జ్ఞానం. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇంతవరకు కాల గర్భంలో దాగి ఉంది. ఏ పాఠశాలకు, కళాశాలకు మరెక్కడికైనా వెళ్లకుండానే  కుండలిని గురించిన జ్ఞానం మీ వద్ద స్పష్టంగా ఉంది. ఏ ప్రయోగశాలకు వెళ్లకుండానే మీరు ప్రయోగాలు చేసి కుండలిని అంటే ఏమిటో తెలుసుకున్నారు. మీ కళ్ళతో మీరే చూసారు. కుండలిని పైకి వెళుతున్నట్లు చూసారు. మీరు ప్రజలకు ఆత్మసాక్షాత్కారం ఇచ్చారు. ఇప్పటికే మీరు పవిత్ర ఆత్మ యొక్క చల్లని చైతన్యాన్ని అనుభవంతో తెలుసుకున్నారు అంతే కాకుండా మీలో ఉన్న శక్తులను కూడా అనుభవంతో తెలుసుకున్నారు. మీరు విషయాలను అర్థం చేసుకోవడంలో మీ జ్ఞానంలో ఉన్నదానికంటే మీరు చాలా భిన్నంగా ఉన్నారని కూడా మీరు చూశారు. మీకున్న ఈ జ్ఞానంతో ఇతరుల కుండలినీ ని ఉద్ధానపరచగలిగే అర్హతను సంపాదించారు. ఇదివరకు గొప్ప గొప్ప సాధువులు, మహర్షులు కూడా చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా చాలా కొద్దిమందికి మాత్రమే ఉన్న కుండలినిని ఉద్ధానపరిచే సామర్ధ్యం ఇప్పుడు మీకు లభించింది. చక్రాల గురించి మీరు అర్థం చేసుకున్నారు, మరియు వాటిని పరీక్షించి నిర్ధారించవచ్చు. పిల్లలు కూడా అలా చేయగలరు. ఇది మానవస్థాయిలో చాలా గొప్ప విషయం అన్నది మీరు గ్రహించటంలేదు. ఇంతవరకు ఒక్క ముక్క కూడా దీని గురించి మనకి తెలియదు. ఇంతవరకు కుండలిని గురించి ఒక్క ముక్క కూడా తెలియనిది, అతి తక్కువ సమయంలో చాలా జ్ఞానవంతులుగా అవ్వడం మీకు సహజయోగా యొక్క ఆశీస్సులే కారణం. మీరు చాలా జ్ఞానవంతులవడం, మీ చిత్తశుద్ధి యొక్క కాంతి పనిచెయ్యడం, చాలా ఆశీస్సులు పొందడాన్ని కూడా చూసి ఉంటారు. మీరు ఏమీ చేయకుండానే కొన్ని పనులు వాటంతట అవే జరగడం వాటి ఫలితాలను సాధించడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు లేదా అది ఎలా జరిగిందో మీరు అర్థం చేసుకోలేరు. అకస్మాత్తుగా నేను అక్కడ ఉన్నాను అది జరిగింది, అనుకోకుండా నేను అక్కడ ఉన్నాడు ఇది జరిగింది అని తెలుస్తుంటుంది, కానీ ఎలా, ఈ మహాసముద్రం అన్ని వివరాలతో పని చేస్తూ ఉంటుంది. ఈ సంఘటనలన్నింటి ద్వారా మీరు ఇప్పుడు సాధారణ మనుషులు కారని తెలుసుకుని కళ్ళు తెరవాలి. కాబట్టి మన వైఖరి మారాలి.                మీ మెదడుపై 7 మరియు హృదయం పై 7 ఆరాలు( రక రకాల కాంతులు) ఉన్నాయి. హృదయపు ఆరాలన్నీ మెదడు ఆరాలను నియంత్రిస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, మెదడులో రెండు సంస్థలున్నాయి : ఒకటి అహంకారం రెండవది పద్ధతులు / నియామాలు . మీరు మెదడును గట్టిగా నొక్కినట్లయితే, మెదడు చుట్టూ ఉన్న ఆరాలు నొక్కబడతాయి, వాటితో పాటు హృదయం చుట్టూ ఉన్న ఆరాలు కూడా నొక్కబడతాయి. ఇదేదో బాగుందని మెదడు ఇలా అనుకుంటుంది,  కుండలినిని ఎలా పైకి తేవాలో నాకు తెలుసు, ఇవన్నీ ఎలా చేయాలో నాకు తెలుసు, అక్కడ ఏమి ఉందో నాకు తెలుసు, హృదయం ఈ విధమైన ఆలోచనవల్ల కరకుగా మారదు. హృదయం కరుకుగా ఉన్నవారెవరైనా హిట్లర్ లాగా ఆలోచించవచ్చు అని అనుకోవచ్చు. కాబట్టి అహంకారం యొక్క నియమాల వల్ల, మరీ ఆలోచించనంత రాతిలాగా కొంతవరకు మారదు. ఒక వ్యక్తిలో అహం ఎక్కువగా ఉంటే అతను తెలివితక్కువగా ఆలోచించవచ్చు కానీ బాగానే  ఉంటాడు. అతను నిజంగా తెలివితక్కువ వాడు అవుతాడు. ఎవరైతే అహంకారులో, ఎవరు అజ్ఞ్యా ఐతే పట్టుకుంటుందో, వారు నిజంగా తెలివితక్కువ వారు. ఇందులో సందేహమే లేదు. అతను ఏదైనా చేస్తున్నప్పుడు, మాట్లాడే పద్దతిలో, ఏదైనా పని చేసినప్పుడు, అతను  చేసిన పనిని ఎక్కువగా ప్రదర్శించుకోవటం ద్వారా  అతను తెలివితక్కువగా అనిపించడం అతని ప్రవర్తనలో చూడవచ్చు. అతను అలాంటి తెలివితక్కువ మనిషని ఏ తెలివైనవాడైనా గమనించగలడు. అందువలన మనకు ఏమి తెలిసిందంటే, మెదడు అహంకారంతో కప్పివేయబడితే ఆమనిషి తెలివితక్కువ వాడు అవుతాడు కానీ, కరుకు మెదడు వాడు కాదు. అటువంటి తెలివితక్కువ మనిషి అన్ని రకాల విషయాలను మాట్లాడటం కొనసాగించగలడు మరియు అటువంటి వారిని మీరు వెంటనే గుర్తించవచ్చు. మరొకవైపు మెదడులో నియమాలు ఏర్పరచుకోవడం, అది ఇంకా మూర్ఖత్వం. ఎవరికైతే నియమాలు ఉంటాయో, అతను వాటినుండి బయటకు రాడు, అతను బయటకి చూపించడు కానీ అతని మెదడు అంతా అసహజమైన మూర్ఖమైన ఆలోచనలతో నిండి ఉంటుంది. ఎలా ఆంటే, ఎవరో పూజలో నా చేతుల్ని కడగడం మరియు ఆ నీటిని త్రాగటానికి ఇవ్వడం చూసి శ్రీమాతాజీ చేతులను కడిగిన నీటిని ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నించాడు. అమ్మ చేతుల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది మనం చేతులను కడగడం ద్వారా ఆ చైతన్యం నీటిలోకి వస్తుంది అని వేరొకతను అన్నాడు. ఈ విషయాన్ని ఆ ప్రశ్నించిన మనిషి నమ్మలేకపోయాడు. ఎందుకంటే చేతులు మురికిపోవడానికే కడుక్కుంటారు అన్న నిబంధన ఉండటంవల్ల వారు పరమచైతన్యం గురించి ఆలోచించలేరు. జనాల్లో ఇలాంటి నియమాలన్నీ మెదడులో ఉండటంవల్ల విషయాలను హృదయపూర్వకంగా తీసుకోలేరు. కానీ ఎం జరుగుతుందంటే వాళ్ళు దాని గురించి మూర్ఖంగా అలోచించి, అబద్ధాలు, అర్థంలేని విషయాలు చెప్పి వారే సరి అని మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు తెలివితక్కువ వాళ్ళు కాదు కానీ వెధవలు. వాళ్ళు వేసే వెధవ వేషాలు మీరు అంగీకరిస్తున్నారు. అందులో జ్ఞానం లేదు. ఒకరు తెలివితక్కువ వారు, మరొకరు వెధవ. రెండు వరుసల మధ్య సహజయోగి. అందువలన ఈ నిబంధనలు మెదడును వక్రీకరిస్తాయి కానీ కరకుగా మార్చదు. ఏది కరుకుగా మారుస్తుందంటే, అతను ఆలోచించలేని విధంగా మానసికంగా అస్తవ్యస్తంగా పుట్టినప్పుడు గానీ, లేదా నియమాలతో పుట్టి మెదడు బాగా ఆలోచిస్తున్నపుడు గానీ, లేదా అహంకారంవల్ల విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు. అలాంటి మెదడు హృదయాన్ని ప్రభావితం చెయ్యదు కానీ హృదయపు ఆరాలు చీకటిగా అవటమో లేదా అదృశ్యమవడమో జరుగుతుంది. అందువలన హృదయం చుట్టూ ఉండే ఆరాలు చాలా సున్నితమైనవి,  మెదడు మీద కాంతి ప్రసరించటం వల్ల ఏమి ఉపయోగం లేదని అనిపించి నెమ్మదిగా చిన్నగా అవడం మొదలవుతుంది. ఇలా హృదయం చిన్నదిగా అవుతుంది. ఈ కారణంగానే వారికీ జీవితంలో ఏ లక్ష్యము లేదు. అందువలన వారి హృదయం రాను రాను చిన్నదిగా మారుతుంది. చిన్న హృదయం ఉన్నవారిని అనుభవం లేని వారని అంటాము. రాతి హృదయస్థులని అంటాము. ఇదంతా మనిషి మెదడు యొక్క  అహంకారపు నిబంధనల వల్ల జరుగుతుంది. ఫలితం హృదయం కరుకుగా మారుతుంది, ఎందుకంటే హృదయం చాలా సున్నితమైనది, మెదడు అంత సున్నితమైనదేమీ కాదు. ఏదైనా మృదువైనది నీళ్లలో పెడితే గట్టిగా  మారుతుంది, మీరు ఒక రాయిని నీళ్లలో పెట్టి మరిగిస్తే అది మారదు.  సున్నితమైన మరియు మృదువైన హృదయం మెదడు యొక్క వేడి అలల్లో మరిగించడం వల్ల గట్టి రాయిలాగా మారుతుంది. దానికి ఒక మాట మంచిగా చెప్పడం తెలియదు. అనకూడని మాటలు అంటూ వారి మనుషుల్నే బాధపెడుతూ ఉంటుంది.  ఎప్పుడు అవతలి మనిషిని ఎలా బాధపెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. వేరొకరిని నేను ఎలా తప్పుదారి పట్టించాలా అని ఆలోచిస్తుంటుంది ఎందుకంటే ఆలా చెయ్యడానికి కపటంతో ఉంటుంది. అహంకారం విషయానికొస్తే, అహంకారం వలన హృదయం గడ్డకట్టిపోతుంది. అప్పుడు హృదయం మెదడుకు ఆరాలను ప్రసరించలేదు. హృదయం పని అయిపోయింది ఇకపై హృదయం నన్ను నియంత్రించలేదని మెదడు అనుకుంటుంది.               అన్ని పనులు నాకు నేనే చేసుకుంటున్నాను అని మెదడు ఆలోచించించడం మొదలు పెడుతుంది. హృదయం చిన్నబోయి కరుకుగా మారి పని చేయదు, అప్పుడు మెదడు ఆధీనంలోకి తీసుకుంటుంది. మెదడు మనకు అర్థం కాని రీతిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాంటి వారు జంతువుల్లా ప్రవర్తిస్తారు. క్రూరంగా మారినట్లు దుష్టశక్తి యొక్క వ్యక్తుల్లా ప్రవర్తిస్తారు. ఒకరకమైన తప్పుడు ఆత్మగౌరవం వల్ల ఇతరులతో మంచిగా మాట్లాడటం ఎలాగో తెలియదు. వారు తమలాంటి మరొకరిని కలిసి కొట్టుకునే వరకు, ఇతరులను అవమానిస్తూ, బాధపెడుతూనే ఉంటారు. అది కొంచం ఉపశమనం లేదంటే ఈపాటికి మనం అందరం పోయేవాళ్ళం. కానీ అహం ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేరు. వారు ఒకరినొకరు తటస్తీకరించుకుంటారు. వారి బారినుండి మనల్ని రక్షించినందుకు భగవంతునికి కృతఙ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రెండు నియమాలు మెదడుపై ఉంటాయి, అవి హృదయాన్ని స్తంభింప చేసి హృదయ పరిపాలనను శూన్యం చేస్తాయి. ఆప్పుడు మెదడు నొక్కి వక్కాణించడం మొదలు పెడుతుంది.ఇతరులతో ఎలా దయతో ఉండాలి, ఇతరులతో మంచిగా ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా సహాయపడాలి, ఇతరులతో ఎలా సున్నితంగా ఉండాలి, ఇతరులకు ఎలా భరోసాగా ఉండాలి, ఇతరులను ఎలా సంరక్షించాలి మొదలగు గుణాలన్నీ మనకు ఇప్పటికే వారసత్వంగా ఉన్నాయి. మనం సహజ యోగాకి వచ్చినప్పటికి రాతిహృదయం ఉండి ఉంటే, మన మెదడు అహంకారమైన లేదా ప్రత్యాహంకారమైన నిండి ఉంటుంది.         కుండలిని ఉద్దానంతో, మొదట మీ మెదడులో మలినాలు తీసివేసుకోవచ్చు. కుండలిని కదిలి మీ హృదయ పీఠమైన బ్రహ్మరంధాన్ని తాకినప్పుడు మలినాలను బహిష్కరిస్తుంది. అప్పుడు హృదయం ఒక రాజు తిరిగి వచ్చినట్లు వచ్చి, మెదడుపై ఆధిపత్యం చెలాయించి, వెంటనే ఎవరితో ఐతే ఇంతవరకు కర్కశంగా, మాట్లాడకుండా, వాళ్ళ అవసరం లేనట్లు ఉన్నామో వెంటనే వారితో ఇబ్బంది లేకుండా స్నేహపూర్వకంగా ఉంటాము. అనేకరకాలుగా వ్యకులు హాని చేసి ఉండవచ్చు, కానీ అదంతా అదృశ్యం అవుతుంది. మీరు చాలా మంచిగా అందంగా మారిపోతారు. ఏమి జరిగిందంటే కుండలిని మీ హృదయ పీఠమైన సహస్రారాన్ని తాకింది. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రము తెరుచుకుంటుందో,  హృదయం కూడా తెరుచుకుంటుంది. హృదయం జాగృతి చెంది, అయ్యో ఈ మెదడుని ఇంతకాలం నా పై ఆధిపత్యానికి అనుమతినిచ్చానా అని అనుకుంటుంది. అకస్మాత్తుగా మారిన వారిని చాలామందిని చూసాము. అమెరికాలో ఒక పెద్దమనిషి అన్నారు: అమ్మా నా ఆత్మసాక్షాత్కారం తరవాత నేను చాలా దయగలవాడిగా మారిపోయాను. నేను నా అంకుల్ ని గానీ, ఎవరినీ పలకరించేవాడిని కాదు. అతను ఇతన్ని ఏంతో యిష్టంగా కలిసి హలో అంకుల్ అని పలకరించాడు, అతని అంకుల్ నీవు బాగానే ఉన్నావా ? నువ్వు ఎప్పడూ పలకరించవు కదా అని అన్నాడు. వెంటనే ఇతను అంకుల్ దగ్గరకి వెళ్లి మీరు ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా అని అడిగాడు. మీకు ఏమైనా సహాయం చెయ్యాలా అని అడిగాడు. చాలా మంచి విషయాలు చెప్పాడు. ఏమి చేస్తున్నావు, మద్యం తీసుకుని వచ్చావా ఏమిటీ ? నువ్వు నాతో ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నావు? నేను నమ్మలేకపోతున్నాను అని అన్నారట. అలా జరుగుతుందన్నమాట. ఈ రకమైన విషయాలన్నీ చాలా తేలిగ్గా వదిలివెయ్యొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాటిని మనం తెచ్చి పెట్టుకున్నాము. అవి మన జీవితాలు లేదా బంధువులే అవ్వనవసరంలేదు, ఒక్కసారి హృదయం జాగృతి చెందగానే అహంకారం మరియు ప్రత్యాహంకారం రెండూ (బుడగలు) పగిలిపోతాయి. మనం వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మనం మంచును పగలకొట్టాలి, వారితో చాలా మర్యాదగా మాట్లాడాలి. ఎలా ఆంటే, ఈ మనిషి ఇంత చెడ్డవాడంటే నేను నమ్మలేకపోతున్నాను, నన్ను అతన్ని చూసుకోనివ్వండి, అతను బాగానే ఉండొచ్చు, ఇతను అంత చెడ్డవాడని నేను అనుకోవట్లేదని మీకు మీరు చెప్పుకున్నట్లు. కొంతమంది చెడ్డతనాన్ని అంగీకరించడం మానవులకు చాలా సులభం. అలా  అంగీకరించడం ప్రారంభించాక, వాళ్ళే ఉత్తమ వ్యక్తులని మరెవరు మంచివారు కాదని, వాళ్ల జీవనశైలిలో ఒక నమ్మకాన్ని పెంచుకుంటారు.              అందువల్ల మొత్తం సంఘం, సమాజం, మానవత్వం ఈ ఆలోచనల కాటుకు గురిఅయ్యింది. సహజయోగ మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం. ఈ సమస్యని అంతం చేయడానికి సహజయోగ మాత్రమే ఏకైక మార్గం. కుండలినీని మళ్ళా మళ్ళా ఉద్ధానం చేయడం ద్వారా విధేయత వస్తుందని ప్రజలు అర్థం చేసుకోవాలని మీరు ప్రార్ధించాలి. మీ బ్రహ్మరంధ్రము తెరుచుకోవడంద్వారా హృదయం పెరుగుతుంది ఒక జాగృతి పొందిన వ్యక్తిత్వంగా మారి, ఇక నేను ఈ మెదడుని స్వాధీనం చేసుకోవాలి లేదంటే అలా అలోచించి అలోచించి మతిస్థిమితం లేనట్లుగా తయారవుతుంది.  ఇలా జరిగిన వెంటనే మీరు నిస్సందేహ అవగాహన కలిగినట్లు తెలుసుకుంటారు.  కాబట్టి రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మొదట అర్థం చేసుకోవాలి, హృదయపు  ఆధిపత్యాన్ని గనక తగ్గించి శూన్యంకి వస్తే రాజులాంటి హృదయం మెదడుచే సవాలు చేయబడుతుంది, అప్పుడు మెదడు రాజు అయ్యి మనల్ని పరిపాలించడం మొదలుపెడుతుంది.                  నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను అనేవి మెదడు యొక్క అహంకారం గనక మీరు వదులుకోగలిగితే, నాకు కావలిసినది అంతా సరిగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.  ఇక్కడ నాకు “కావలసినది” అని ఉపయోగించాలి, ఈ శరీరం దీన్ని కావాలనుకుంటుంది. మీ నుంచి మిమ్మల్ని వేరు చేయండి. క్రమంగా మీరు అటువంటి పరిస్థితుల నుండి నేను ఇలా అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను అని అనకుండానే  మిమ్మల్ని మీరు వేరుచేయడం మొదలుపెడతారు ఇది ఒక శరీరం, ఈ చేయి, ఈ తల అని మీరు వేరుచేయడం ప్రారంభించండి. మీరు వేరు చేసిన తర్వాత అహంకారం మరియు ప్రత్యాహంకారం యొక్క ఈ అడ్డంకులన్నీ అదృశ్యమవుతాయి. మీ కుండలిని ఉద్ధానమయ్యి, బ్రహ్మరంధాన్ని తెరిపించడం/పగులకొట్టటం ద్వారా మాత్రమే ఈ రెండింటి నుండి బయటపడటం చాలా సులభం అవుతుంది. బ్రహ్మ రంధ్రాన్ని పగులగొట్టి మీ కుండలినీ పరమాత్మ శక్తి తో అనుసంధానమవడమనేది చాలా గొప్ప విజయం. అందుకే మీరు ధ్యానం చేయాలి మరియు మీరు ఆలోచనా రహితంగా ఉండాలి అని నేను ఎప్పుడూ చెప్తాను, ఇది కుదురుతుంది. బయట విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించొద్దు.  మీరు సహజయోగ కి ఒక విధంగా బాధ్యతతో ఉన్నారనుకోండి,ఎందుకంటే మీరు దీని గురించి ఒక విధంగా చాలా నిజాయితీగా ఉన్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక విధంగా నిజాయితీగా ఉన్నారు. కానీ సహజయోగాకి ఎంత నిజాయితీతో ఉన్నారు?                     – పరమ పూజ్య శ్రీమతాజీ నిర్మలా దేవి