Birthday Puja

New Delhi (India)

Feedback
Share
పుట్టినరోజు పూజ, న్యూ డిల్లీ (ఇండియా), 21 మార్చి 2004.

[శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]
మీరందరూ ఇంత గొప్ప ప్రేమ మరియు గౌరవంతో నాకు స్వాగతం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.

మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు.

[శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]
ఈ రోజు నాకు ఇంత హృదయపూర్వక స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఏ పదాలు ఉపయోగించాలో నాకు తెలియట్లేదు .

[శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]
ఈ రోజు ప్రతి క్షణం నేను ఆనందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అందరికీ నేను ఏమి చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ మరియు గౌరవం నా బలానికి మించినవి, నా నిరీక్షణకు మించినవి. మీరందరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కాలేదు, మీ అందరి కోసం నేను ఏమి చేశానో నాకు తెలియదు, మీరందరూ కావాలని కోరుకున్నది , మీకు లభించినది. నేను మీ అందరి కోసం ఏమీ చేయలేదు.

[శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]
మీరందరూ స్వాగతించిన తీరు చూసి నాకు అమితమైన సంతోషం కలిగింది  మరియు మీరు సంతోషం మరియు పరమానందంతో పాటలు పాడుతున్నారు. నాకు ఎలా వ్యక్తపరచాలో తెలియటంలేదు, ఎందుకంటే నాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను మరియు మీ ప్రశంసలకు ఏమి చెప్పాలో తెలియటంలేదు, మీరు సహజయోగం చాలా సులభంగా తీసుకున్నారు మరియు దానిని సమీకరించారు.
ఏది ఏమైనా, ఇది చాలా పరస్పర ప్రశంసించుకునే సమాజం, మనం ఒకరినొకరు ఆనందిస్తున్నామని చెప్పాలి.
భగవంతుడు ఈ సంతోషం మరియు పరమానందం మరియు దైవంతో సంపూర్ణ ఐక్యతతో మీ అందరికీ ఆశీర్వదించాలి.

మీకు చాలా ధన్యవాదాలు, ధన్యవాదాలు.
[చప్పట్లు]
ధన్యవాదాలు.
[చప్పట్లు]
ఇప్పుడు వారు మీ వినోదం కోసం కొంత సంగీతాన్ని ఏర్పాటు చేశారు, అందువల్ల నేను వారిని నిర్వహించమని చేసుకోమని అడుగుతాను…
ధన్యవాదాలు.