Birthday Puja New Delhi (India)

పుట్టినరోజు పూజ, న్యూ డిల్లీ (ఇండియా), 21 మార్చి 2004.[శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]మీరందరూ ఇంత గొప్ప ప్రేమ మరియు గౌరవంతో నాకు స్వాగతం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు.[శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]ఈ రోజు నాకు ఇంత హృదయపూర్వక స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఏ పదాలు ఉపయోగించాలో నాకు తెలియట్లేదు .[శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]ఈ రోజు ప్రతి క్షణం నేను ఆనందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అందరికీ నేను ఏమి చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. […]

Birthday Puja: Sincerity Curzon Hall, Sydney (Australia)

 మిమ్మల్ని చూసుకోవటానికి, మీ కోసం శ్రద్ధ వహించడానికి మరియు చాలా జ్ఞానంతో మిమ్మల్ని మార్చగలిగే తల్లి మీకు అవసరం. సహజయోగులు కూడా వారి హృదయాలను విస్తరించుకుంటూ, వారు ఇక నీటి బిందువులు కాదని,  సముద్రంలో భాగం అని వారు గ్రహిస్తున్నట్లు నేను తెలుసుకుంటున్నాను. ఆ సముద్రమే వారిని బలోపేతం చేస్తూ, పోషిస్తూ వారిని చూసుకుంటుంది. అదే సముద్రం వారికి మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ నీటిబిందువులు మరియు సముద్రం యొక్క అనుసంధానం పూర్తిగా ఏర్పడాలి. అప్పుడు నీటి బిందువు యొక్క పరిమితులు సముద్రం యొక్క గొప్పతనంలో పూర్తిగా కరిగిపోతాయి. ముందుగా, సమిష్టి( కలెక్టివిటీ) గా ఉండాలనే నిజమైన కోరిక, శ్రద్ధ మరియు మంచి విషయాలు చెప్పటం ద్వారా సమిష్టి ని మెరుగుపరచవచ్చు. […]

Paramchaitanya Puja Taufkirchen (Germany)

ఈ రోజు మనం ఏ పూజ చేయబోతున్నాం అని నన్ను అడిగారు. నేను దానిని రహస్యంగా ఉంచాను. ఈ రోజు మనం పరమ చైతన్యమును ఆరాధించాలి. అదే అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క ప్రేమ. పరమ చైతన్యము దయతో ప్రతిదీ పనిచేస్తుందని మనందరికీ తెలుసు, కనీసం మానసికంగా అయినా తెలుసు. ఇదే ఆదిశక్తి యొక్క శక్తి. కానీ ఇప్పటికీ ఈ విషయం మన హృదయంలో గానీ, మన ధ్యాసలో కానీ అనుకున్నంతగా లేదు. ఒక మహా సముద్రము వలె పరమ చైతన్యము అంతటినీ తనలో కలిగి ఉన్నది. ప్రతిదానికి, పని చేసే ప్రతీ దానికీ స్వంత పరిమితులు ఉంటాయి. అందువలన పరమ చైతన్యమును దేనితోనూ పోల్చలేము. […]

Talk, Eve of Shri Vishnumaya Puja YWCA Camp, Pawling (United States)

ప్రశ్న : శ్రీమాతాజీ, మాలో చాలామందికి హంస చక్రం గురించి తెలియదు, హంస చక్రంకు మరియు విశుద్ధికి గల సంబంధం మరియు విశుద్ధి చక్రమును బలోపేతం చేయడానికి మేము ఏమి చెయ్యాలో వివరించండి.శ్రీమాతాజీ : హంస చక్రం, విశుద్ధి చక్రానికి మరియు ఆజ్ఞా చక్రానికి మధ్య ఉండడం మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. విశుద్ధి నుంచి చాలా నరాలు హంస దగ్గర ఆగిపోతాయి, అవి మెదడు వరకు వెళ్లవు. ఇక్కడ మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలుగా పిలవబడే ప్రతిచర్యలన్నీ ఆగిపోతాయి. నాకు మురికి వాసన వచ్చిందనుకోండి ముక్కు మూసుకుంటాను, వినకూడనిది వింటే చెవులు లాగుతాను, ఏదైనా చూడకూడనిది చుస్తే నా కళ్ళు వాటికవే మూసుకుంటాయి. ఎవరైనా సూదితో/పిన్నుతో గుచ్ఛటానికి దగ్గరకి తేగానే ఆకస్మికంగా నేను నా చేతిని వెనక్కి తేసేస్కుంటాను. […]

Enjoying The Joy San Diego (United States)

మానవాతీత అవగాహన  :

ఇంత ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి…ఇలా జరుగుతూ ఉంటుంది, ఎం జరిగినా మనం అంగీకరించాలి, దైవం అలా జరిపిస్తుంటుంది. ప్రతిదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు, మనలో ఏ శక్తి కేంద్రాలున్నాయో వారు మీకు వివరించగలిగుండాలి, మరియు మనలో వాటి నిర్మాణం/పనిచేసే విధానం ఎలా ఉన్నదో అతను మీకు వివరించారు. ఇవన్నీ మన పరిణామం యొక్క వివిధ కాలాల్లో నిర్మించబడ్డాయి. ప్రతీ శక్తి కేంద్రం అలానే నిర్మింపబడింది.                                        ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మార్గం వలే నిర్మింపబడ్డాయి. […]