Unidentified Hindi Talk, date unknown (Extract on Agnya Chakra) New Delhi (India)

కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు, కూర్చున్నారు. అప్పుడు కూడా వారి సమస్యల గురించి వారు ఆలోచిస్తున్నారు. నాకు ఇది జరిగింది , అది అది జరిగింది, ఇది ఇలా జరిగింది అని. మరియు నా సమస్య గురించి మాతాజీతో ఎప్పుడు చెప్పగలను? మాతాజీ మీరు కూడా ఇక్కడ లేరు, నేను అలాంటి సమస్యలో ఉన్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి బదులు మీ ఆంతర్యపు ఆలోచనలలో మీరు రెచ్చగొట్టబడి ఉన్నారు. మరియు ఆ భ్రమలో, మీకు కాన్సర్ వచ్చింది. మీకు ఈ వ్యాధి వచ్చింది, మీకు ఆ వ్యాధి వచ్చింది. కేవలం మానసిక యోచన, మనం మానసికంగా ఏమి ఆలోచిస్తున్నాము? ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి? మనకు ఈ శోకం వుంది, ఆ దుఃఖం వుంది లాంటి ఆలోచనలు. ఇది మామోత్(పూర్వయుగమందు ఉన్న ఒక జంతువు) సమస్య. దాని బదులు మీరు ఏమి ఆలోచించాలి? మీరు ఆశీర్వాదాలు లెక్కించుకోండి. తల్లి యొక్క ఆశీర్వాదాలు మనకు ఎన్ని ఉన్నాయి? కోట్ల కొలదీ ప్రజలు ఈ ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. వారిలో ఎంతమందికి సహజయోగం వచ్చింది? మనం కొంత ప్రత్యేకత కలిగిన వ్యక్తులం. చిత్తాన్ని పాడు చేసుకుంటున్న కొంతమంది పనికిమాలినవారు కాదు. మనకి సహజయోగం వుంది. ఆంతర్యం నుండి ఇది మనకి అనుభవంలోకి రావాలి. మరియు అంతర్గతంగా జీవి లోతుల్లోకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ మోసపూరిత పరిమితుల నుంచి మీరు బయటపడొచ్చు. మీ ఆలోచన మీది. మేము ఢిల్లీ నుంచి వచ్చాము అని చెబితే ఒకరోజు ఈ ఢిల్లీలోని ప్రజలు మిమ్మల్ని బహిష్కరించవచ్చు. నోయిడా నుంచి వచ్చాము అని మీరు చెబితే ఒకరోజు, నోయిడా ప్రజలు తమ తుపాకీలతో మీ వెంట పరుగెడతారు, నేను నోయిడా నుండి వచ్చానని ఎందుకు చెప్పానా అని అప్పుడు గ్రహిస్తారు. అప్పుడు, మీరు ఢిల్లీ వైపు పరుగెడతారు ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని ధిక్కరిస్తూ ఇలా అంటారు మీరు నొయిడాకి చెందినవారు కదా, ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఈ విధంగా మీరు ఎక్కడికీ సంబంధించిన వారు కాదు మరియు ఎక్కడా మీ స్వంతం అని పిలవడానికి ఉండదు. కారణం ఏమిటంటే మీ చిత్తం ఎక్కడికీ సంబంధించినది కాదు, ఇక్కడా లేదు, అక్కడా లేదు. మీరు గ్రహించి మరియు లోతులకి వెళితే తప్ప మిమ్మల్ని మీరు సహజ యోగిని లేదా సహజ యోగి అనుకోవచ్చు. వాస్తవానికి మీరు ఒక్కరు అని నేను అనుకోను. ఎందుకంటే Read More …