Amruta

  మీరు శ్రీమాతాజి ప్రసంగాలు వింటున్నప్పుడు, తల్లి చెప్పిన విషయాలను గమనించండి మరియు అవి మీకు ఎలా ఉపయోగం అవుతాయన్నది విశ్లేషించుకోండి. కాబట్టి, సహజయోగముకు సంబంధించిన విద్య చాలా ముఖ్యం, లేకుంటే మీ మేధస్సు తుడిచి కొట్టుకుపోతుంది. మీరు సహజయోగ విద్యను గురించి పూర్తి అవగాహన కలిగివుండాలి, కేవలం ఆత్మసాక్షాత్కారం ఇవ్వటం ఒక్కటే పని కాదు. సహజయోగములొ విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి, అప్పుడే అది ఇతరులకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలిసినంత విద్య గతంలో ఎవరికీ లేదు, మునులకు సైతం లేనిది. కాబట్టి ఇప్పుడే పూర్తి ప్రయోజనం తీసుకోండి. మీ వయస్సు, విద్య, అర్హతలు ఏమైనా కావచ్చు, దానితో పట్టింపు లేదు కానీ సహజయోగము అంటే ఏమిటి అనేది మాత్రం మీ అందరికి తెలిసి వుండాలి. దాని ఉపాయం మరియు అది ఎలా పని చేస్తుంది అనేది తెలుసుకోవాలి.  

(శ్రీమాతాజి నిర్మలా దేవి, మెల్బౌర్న్, 17 మార్చి 1985)