Birthday Puja New Delhi (India)

పుట్టినరోజు పూజ, న్యూ డిల్లీ (ఇండియా), 21 మార్చి 2004. [శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]మీరందరూ ఇంత గొప్ప ప్రేమ మరియు గౌరవంతో నాకు స్వాగతం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. [శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]ఈ రోజు నాకు ఇంత హృదయపూర్వక స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఏ పదాలు ఉపయోగించాలో నాకు తెలియట్లేదు . [శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]ఈ రోజు ప్రతి క్షణం నేను ఆనందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అందరికీ నేను ఏమి చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ మరియు గౌరవం నా బలానికి మించినవి, నా నిరీక్షణకు మించినవి. మీరందరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కాలేదు, మీ అందరి కోసం నేను ఏమి చేశానో నాకు తెలియదు, మీరందరూ కావాలని కోరుకున్నది , మీకు లభించినది. నేను మీ అందరి కోసం ఏమీ చేయలేదు. [శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]మీరందరూ స్వాగతించిన తీరు చూసి నాకు అమితమైన సంతోషం కలిగింది  మరియు మీరు సంతోషం మరియు పరమానందంతో పాటలు పాడుతున్నారు. నాకు ఎలా వ్యక్తపరచాలో తెలియటంలేదు, ఎందుకంటే నాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను మరియు మీ ప్రశంసలకు ఏమి చెప్పాలో తెలియటంలేదు, మీరు సహజయోగం చాలా సులభంగా తీసుకున్నారు మరియు దానిని సమీకరించారు.ఏది ఏమైనా, ఇది చాలా పరస్పర ప్రశంసించుకునే సమాజం, మనం ఒకరినొకరు ఆనందిస్తున్నామని చెప్పాలి.భగవంతుడు ఈ సంతోషం మరియు పరమానందం మరియు దైవంతో సంపూర్ణ ఐక్యతతో మీ అందరికీ ఆశీర్వదించాలి. మీకు చాలా ధన్యవాదాలు, ధన్యవాదాలు.[చప్పట్లు]ధన్యవాదాలు.[చప్పట్లు]ఇప్పుడు వారు మీ వినోదం కోసం కొంత సంగీతాన్ని ఏర్పాటు చేశారు, అందువల్ల నేను వారిని నిర్వహించమని చేసుకోమని అడుగుతాను…ధన్యవాదాలు.

Birthday Puja: Sincerity Curzon Hall, Sydney (Australia)

 మిమ్మల్ని చూసుకోవటానికి, మీ కోసం శ్రద్ధ వహించడానికి మరియు చాలా జ్ఞానంతో మిమ్మల్ని మార్చగలిగే తల్లి మీకు అవసరం. సహజయోగులు కూడా వారి హృదయాలను విస్తరించుకుంటూ, వారు ఇక నీటి బిందువులు కాదని,  సముద్రంలో భాగం అని వారు గ్రహిస్తున్నట్లు నేను తెలుసుకుంటున్నాను. ఆ సముద్రమే వారిని బలోపేతం చేస్తూ, పోషిస్తూ వారిని చూసుకుంటుంది. అదే సముద్రం వారికి మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ నీటిబిందువులు మరియు సముద్రం యొక్క అనుసంధానం పూర్తిగా ఏర్పడాలి. అప్పుడు నీటి బిందువు యొక్క పరిమితులు సముద్రం యొక్క గొప్పతనంలో పూర్తిగా కరిగిపోతాయి. ముందుగా, సమిష్టి( కలెక్టివిటీ) గా ఉండాలనే నిజమైన కోరిక, శ్రద్ధ మరియు మంచి విషయాలు చెప్పటం ద్వారా సమిష్టి ని మెరుగుపరచవచ్చు. సమిష్టిగా ఉండాలి అన్న కోరిక నిజాయితీగా ఉండాలి. ఇది మీ ఉనికి యొక్క విస్తరణకు సహాయపడుతుంది. మొదట కావలసింది మీకు మీరు నిజాయితీగా ఉండటం. మనం చిన్న నీటిబిందువు నుంచి రావటంవల్ల మళ్ళా మళ్ళా ఆ బిందువు యొక్క పరిమితుల్లోనే ఉండిపోతామనుకోండి, కానీ మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారనే ముందు చూపు ఉండాలి. అందువల్ల మీరు సమిష్టిగా ఉండాలనుకుంటున్న ఆలోచనకు చిత్తశుద్ధి/నిజాయితి అన్ని అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. మీరు గనక ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవటానికి నిజాయితీగా ప్రయతిస్తున్నట్లైతే  సమయాన్ని, రోజుని మరియు అన్నీ మరిచిపోతారు. అవి చిన్నవి అయినా మీరు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీకు ఆ నిజాయితీ ఎక్కడ నుంచి వస్తుంది? నిజాయితీని ఆచరణలో పెట్టాలంటే రెండు విషయాలున్నాయి. మొదట మీకు మీరుగా తెలుసుకోవలసినది – సహజయోగా అంటే ఏమిటి? సహజయోగ మీకు ఏమి ఇచ్చింది? సహజయోగ మీకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చింది, విస్తృతమైన దృష్టిని ఇచ్చింది, సామూహిక చైతన్యాన్ని ఇచ్చింది, ఆలోచనారహిత స్థితికి ఇచ్చింది, నిస్సందేహస్థితిని ఇచ్చింది, మీ నుండి కొత్త వ్యక్తిత్వాన్ని సృష్టించింది. సరిగ్గా గ్రుడ్డు పక్షిగా మారినట్లు. ఇప్పుడు మీరు పక్షి అయినారు. సహజయోగ మీకోసం ఏమి చేసిందో, దానితో మీరు ఏమి సాధించారో గ్రహించాక, మరలా గ్రుడ్డు స్థితికి మీరు వెళ్ళలేరు.       మీరు జ్ఞానాన్ని సాధించారు. కుండలిని జ్ఞానం. ఈ జ్ఞానం ఇన్ని సంవత్సరాలుగా రహస్యంగా ఉంచబడింది. ఇది ఖచ్చితంగా రహస్య జ్ఞానం. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇంతవరకు కాల గర్భంలో దాగి ఉంది. ఏ పాఠశాలకు, కళాశాలకు మరెక్కడికైనా వెళ్లకుండానే  కుండలిని గురించిన జ్ఞానం మీ వద్ద స్పష్టంగా ఉంది. Read More …