Talk, Eve of Shri Vishnumaya Puja YWCA Camp, Pawling (United States)

ప్రశ్న : శ్రీమాతాజీ, మాలో చాలామందికి హంస చక్రం గురించి తెలియదు, హంస చక్రంకు మరియు విశుద్ధికి గల సంబంధం మరియు విశుద్ధి చక్రమును బలోపేతం చేయడానికి మేము ఏమి చెయ్యాలో వివరించండి.శ్రీమాతాజీ : హంస చక్రం, విశుద్ధి చక్రానికి మరియు ఆజ్ఞా చక్రానికి మధ్య ఉండడం మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. విశుద్ధి నుంచి చాలా నరాలు హంస దగ్గర ఆగిపోతాయి, అవి మెదడు వరకు వెళ్లవు. ఇక్కడ మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలుగా పిలవబడే ప్రతిచర్యలన్నీ ఆగిపోతాయి. నాకు మురికి వాసన వచ్చిందనుకోండి ముక్కు మూసుకుంటాను, వినకూడనిది వింటే చెవులు లాగుతాను, ఏదైనా చూడకూడనిది చుస్తే నా కళ్ళు వాటికవే మూసుకుంటాయి. ఎవరైనా సూదితో/పిన్నుతో గుచ్ఛటానికి దగ్గరకి తేగానే ఆకస్మికంగా నేను నా చేతిని వెనక్కి తేసేస్కుంటాను. ఇవ్వనీ నా శరీర వ్యవస్థలోనే నిర్మించబడ్డాయి. మీరు కూడా మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలతోనే ప్రతిస్పందిస్తారు.                                  జంతువులు వేరు, జంతువులకు ఇలాగే జరగకపోవచ్చు, కొన్ని జంతువులకు కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉన్నాయి, మరికొన్ని జంతువులకు వేరేవి ఉన్నాయి. మనము వేరు, మనందరికీ దాదాపు ఈ చర్యలన్నీ ఒకేలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు, అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. వారి వారి నియమాల ప్రకారం ఒకరు “యాహ్” అంటారు, మరొకరు “ఓహ్” అంటారు, మరొకరు మరొకవిధంగా అనవచ్చు. కానీ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఒకేవిధంగా ఉంటాయి.              కాబట్టి అసంకల్పిత ప్రతీకార చర్యలకు మనం విచక్షణను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే రెండు నాడులు కలుస్తున్నాయో, ఆ కలిసే చోటును ఉపయోగించుకుంటున్నప్పుడు ఆజ్ఞాకి వెళ్లకుండా హంస చక్రం యొక్క పని(విచక్షణ) మొదలవుతుంది. అందువలన ఈ రెండు నాడులు కలిసినప్పుడు మన అనుభవాల ద్వారా పరిస్థితిని చూడటం ప్రారంభిస్తాము. మొదటిది స్వాంచాలికమైన ప్రతిచర్య, రెండవది అనుభవాల ద్వారా చూడటం : ఒక పిల్లవాడిని  “ఇక్కడ వేడిగా ఉంది నువ్వు చెయ్యి పెట్టవద్దు” అని అన్నారనుకోండి, వినడు. పిల్లవాడిని ఆలా వదిలేస్తే, కాలినప్పుడు అతని అనుభవం ద్వారా ప్రతిచర్యలు మరియు వాటి నియమ నిబంధనలు/కండీషనింగ్స్ వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి ప్రతిచర్యలు మనలో నిర్మింపబడతాయి. మీరు గమనించినట్లయితే, జాతి వివక్ష ఉన్న దేశానికి లేదా Read More …

Enjoying The Joy San Diego (United States)

మానవాతీత అవగాహన  : ఇంత ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి…ఇలా జరుగుతూ ఉంటుంది, ఎం జరిగినా మనం అంగీకరించాలి, దైవం అలా జరిపిస్తుంటుంది. ప్రతిదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు, మనలో ఏ శక్తి కేంద్రాలున్నాయో వారు మీకు వివరించగలిగుండాలి, మరియు మనలో వాటి నిర్మాణం/పనిచేసే విధానం ఎలా ఉన్నదో అతను మీకు వివరించారు. ఇవన్నీ మన పరిణామం యొక్క వివిధ కాలాల్లో నిర్మించబడ్డాయి. ప్రతీ శక్తి కేంద్రం అలానే నిర్మింపబడింది.                                        ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మార్గం వలే నిర్మింపబడ్డాయి. ఎడమ మరియు కుడి  మార్గాల ద్వారా మీరు మీ ఉన్నతికి కావాలసిన మధ్య మార్గమును సృష్టిస్తారు. మీ శుద్ధ ఇచ్ఛ యొక్క శక్తి ఉద్దానం అయ్యి, జాగృతి చెంది, ఏడవ శక్తి కేంద్రం నుంచీ చొచ్చుకుని పోతుంది, దాన్నే సహస్రారం అంటాము, అంటే, వెయ్యి రేకుల శక్తి కేంద్రం – మెదడు, లేదా మెదడులో లింబిక్ ని కప్పే కొంత భాగం. పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ . అది మన హృదయంలో నివసిస్తుంది. ఎప్పుడైతే కుండలిని ఆత్మయొక్క పీఠమైన సహస్రారాన్ని తాకుతుందో, అది హృదయంలో ప్రతిబింభించి, జ్ఞానోదయం పొందుతుంది. దీని అర్థం ఆత్మ జ్ఞానోదయం పొందుతుందని అర్థం కాదు.  ధ్యాస అన్నది ఒక చీర లాంటిది, అది పైకి ఇలా (శ్రీమాతాజీ వీడియోలో చూపిస్తారు) నెట్టివేయబడి, తాకి, సహస్రారంలో పీఠం కలిగిన, హృదయంలో ఉన్న ఆత్మను ప్రభావితం చేసి మన కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించటం మొదలుపెడుతుంది.                            కాబట్టి, మీ తలపై చల్లటి గాలి రావటమనేది మీకు కలిగే మొదటి అనుభూతి. మీకు కలిగే రెండవ అనుభూతి: సర్వ వ్యాపకమైన శక్తి, అదే పరమ చైతన్యం. ఇప్పుడు మీరు మీ అవగాహన యొక్క సూక్ష్మ స్థితిలోకి ప్రవేశించారు. మొదట మానవ అవగాహన పెరుగుతుంది, కానీ ఎప్పుడైతే మీరు మీ ఆత్మను తాకుతారో/తెలుసుకుంటారో, ఆలోచనా రహితమైన అవగాహనను పొందుతారు. కానీ ఆలోచన ఉండదు, స్థూలం/భౌతికం పోతుంది, ఆలోచనలు మాయమవుతాయి. మీరు సూక్ష్మంగా మారతారు. ఈ సూక్ష్మత మీకు కొన్ని శక్తులను ఇస్తుంది. మీ అవగాహన సమిష్టి స్పృహలోకి Read More …

Unidentified Hindi Talk, date unknown (Extract on Agnya Chakra) New Delhi (India)

కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు, కూర్చున్నారు. అప్పుడు కూడా వారి సమస్యల గురించి వారు ఆలోచిస్తున్నారు. నాకు ఇది జరిగింది , అది అది జరిగింది, ఇది ఇలా జరిగింది అని. మరియు నా సమస్య గురించి మాతాజీతో ఎప్పుడు చెప్పగలను? మాతాజీ మీరు కూడా ఇక్కడ లేరు, నేను అలాంటి సమస్యలో ఉన్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి బదులు మీ ఆంతర్యపు ఆలోచనలలో మీరు రెచ్చగొట్టబడి ఉన్నారు. మరియు ఆ భ్రమలో, మీకు కాన్సర్ వచ్చింది. మీకు ఈ వ్యాధి వచ్చింది, మీకు ఆ వ్యాధి వచ్చింది. కేవలం మానసిక యోచన, మనం మానసికంగా ఏమి ఆలోచిస్తున్నాము? ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి? మనకు ఈ శోకం వుంది, ఆ దుఃఖం వుంది లాంటి ఆలోచనలు. ఇది మామోత్(పూర్వయుగమందు ఉన్న ఒక జంతువు) సమస్య. దాని బదులు మీరు ఏమి ఆలోచించాలి? మీరు ఆశీర్వాదాలు లెక్కించుకోండి. తల్లి యొక్క ఆశీర్వాదాలు మనకు ఎన్ని ఉన్నాయి? కోట్ల కొలదీ ప్రజలు ఈ ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. వారిలో ఎంతమందికి సహజయోగం వచ్చింది? మనం కొంత ప్రత్యేకత కలిగిన వ్యక్తులం. చిత్తాన్ని పాడు చేసుకుంటున్న కొంతమంది పనికిమాలినవారు కాదు. మనకి సహజయోగం వుంది. ఆంతర్యం నుండి ఇది మనకి అనుభవంలోకి రావాలి. మరియు అంతర్గతంగా జీవి లోతుల్లోకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ మోసపూరిత పరిమితుల నుంచి మీరు బయటపడొచ్చు. మీ ఆలోచన మీది. మేము ఢిల్లీ నుంచి వచ్చాము అని చెబితే ఒకరోజు ఈ ఢిల్లీలోని ప్రజలు మిమ్మల్ని బహిష్కరించవచ్చు. నోయిడా నుంచి వచ్చాము అని మీరు చెబితే ఒకరోజు, నోయిడా ప్రజలు తమ తుపాకీలతో మీ వెంట పరుగెడతారు, నేను నోయిడా నుండి వచ్చానని ఎందుకు చెప్పానా అని అప్పుడు గ్రహిస్తారు. అప్పుడు, మీరు ఢిల్లీ వైపు పరుగెడతారు ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని ధిక్కరిస్తూ ఇలా అంటారు మీరు నొయిడాకి చెందినవారు కదా, ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఈ విధంగా మీరు ఎక్కడికీ సంబంధించిన వారు కాదు మరియు ఎక్కడా మీ స్వంతం అని పిలవడానికి ఉండదు. కారణం ఏమిటంటే మీ చిత్తం ఎక్కడికీ సంబంధించినది కాదు, ఇక్కడా లేదు, అక్కడా లేదు. మీరు గ్రహించి మరియు లోతులకి వెళితే తప్ప మిమ్మల్ని మీరు సహజ యోగిని లేదా సహజ యోగి అనుకోవచ్చు. వాస్తవానికి మీరు ఒక్కరు అని నేను అనుకోను. ఎందుకంటే Read More …