Nabhi Chakra

(England)

Feedback
Share
Upload transcript or translation for this talk

నాభి చక్రంఫిబ్రవరి 1977. ఈ ప్రసంగం భారతదేశంలో పాశ్చాత్య యోగుల మొదటి భారత పర్యటన (జనవరిమార్చి1977) సందర్భంగా ఇవ్వబడిందిఖచ్చితమైన స్థానం తెలియదు.

నాభి చక్రం, ప్రతి మనిషి యొక్క గురుత్వాకర్షణ కేంద్రంలో ఉంచబడింది. అది ఆ స్థానంలో లేనట్లయితే దానిని సరైన స్థానంలోనికి తిరిగి తీసుకురావడం మీకో చిన్న సమస్య కావచ్చు. మీలో చాలా మంది ఒక రకమైన ఇబ్బందితో బాధపడుతున్నారు.అది మాదక ద్రవ్యాల వల్ల కావచ్చు లేదా నరాల సమస్యల వల్ల కావచ్చు, యుద్ధం వల్ల కావొచ్చు లేదా జీవనంలో కలిగిన ఆకస్మిక పరిణామాల వల్ల కావచ్చు. ఉదాహరణకు, యుద్ధ సమయంలో ప్రజలు తమ విలువలను కోల్పోయారు, ఎందుకంటే వారు భగవంతునిపై విశ్వాసం కోల్పోయారు. పవిత్రతను నమ్ముకున్న పవిత్రమైన మహిళలు క్రూరంగా బలాత్కరించబడ్డారు. అమిత భక్తికల వ్యక్తులు హింసించబడ్డారు, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, చాలా మంది పురుషులు చంపబడ్డారు, పిల్లలు,మహిళలు మరియు వృద్ధులు చెల్లాచెదురైపోయారు. చాలా భయంకరమైన అభద్రతా వాతావరణం ఈ దేశాలన్నింటినీ అధిగమించింది. ఆ తర్వాత కాన్సంట్రేషన్ క్యాంపులు/ఏకాగ్రతా శిబిరాలు వచ్చాయి. ఇవి కూడా మనుషులను ఛిన్నాభిన్నం చేశాయి, ఎందుకంటే మనుషులు చాలా సున్నితమైన సాధనాలు. వారు ప్రతిష్టాత్మకమైన సృష్టి, వారు అత్యున్నతమైన కలిగిన వారు. వారు బాంబుల వంటి భౌతికమైన వాటిచే ఆధిపత్యం చెలాయించబడ్డారు. ఆ విధంగా, మనిషిలోని ఆత్మ చనిపోయింది.ప్రజలు ధర్మం మీద, ప్రేమ మీద నమ్మకం కోల్పోయారు.

అప్పుడు భద్రత యొక్క కొత్త కార్య ప్రణాళిక నిర్మించబడింది. పారిశ్రామిక విప్లవం దానిని అనుసరించింది. ఫలితంగా ఆనందం,భద్రత, ప్రేమ యొక్క కృత్రిమ భావనను సమాజం అంగీకరించింది. మనిషి తన స్వేచ్ఛతో ఈ విధంగా చేసాడు. ఎందుకంటే యుద్ధాలు మానవునిచే సృష్టించబడ్డాయి గానీ భగవంతుడు చేయలేదు. కానీ దానితో పాటు, చాలా ఉన్నతమైన ఆత్మలు ఈ భువిపై జన్మను తీసుకున్నారు. వారు భౌతికవాదం/భౌతికమైన వాటి వంటి ఈ కృత్రిమ భద్రతకు మించి అన్వేషించడం ప్రారంభించారు. సాధకులకు సంఘటితం/కార్య నిర్వహణ/organize చేయడానికి మరియు వారిని సరైన మార్గంలో నడిపించడానికి యోగ్యమైన నాయకులు లేరు. అందువలన వారు చేసిన పొరపాట్లు అవరోధం కలిగించాయి. కాబట్టి, మానవ అవగాహన యొక్క అడ్డంకులే కాకుండా, అనేక ఇతర అడ్డంకులు జోడించబడ్డాయి. ఇతరత్రా చాలా అడ్డంకులు జోడించబడ్డాయి, ఇవి వారికి సహజ యోగంను కష్టమైన ప్రక్రియగా/పధ్ధతిగా/process చేసింది.

ఏ ఏ దేశాలైతే యుద్ధంలో పాల్గొన్నాయో అవి మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. ప్రతి చర్యగా, అవును ప్రతి చర్యే,ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో, వారు మాత్రమే అభివృద్ధి చెందిన వ్యక్తులు, లేని వారు అభివృద్ధి చెందని వారు. అందువలన ఒక పక్క అధిక అభివృద్ధిని కలిగిన దేశాలు అన్వేషణకు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అవి సుసంపన్నమైన దేశాలు. కానీ ఆ దేశపు అన్వేషకులు వ్యతిరేక భావాల కారణంగా వారి మూలాలను కోల్పోయారు. మరొక పక్క అభివృద్ధి చెందని దేశాలు:అందువలన అక్కడ వారు ఇంకా ధనం కొరకు అన్వేషిస్తున్నారు.

ఈ సమయంలో, సహజ యోగం కనుగొనబడింది, ఈ వేదిక ద్వారా, భగవంతునితో మానవ జాగృతి/అవగాహన అను నిశ్చయమైన ఐక్యత స్థాపించబడినది. దీని ద్వారా మీరు మీ అచేతన స్థితిని అనుభవిస్తారు, అదే భగవంతుని శక్తి, అదే పరమ చైతన్యం/సర్వ వ్యాపక శక్తి. ఇది ఆలోచీస్తుంది, వ్యవస్థీకరిస్తుంది, మరియు ప్రణాళికలను వేస్తుంది. సహజ కుండలినీ యోగం ద్వారా మాత్రమే మానవులు అభివృద్ధి చెందుతారు. అయితే పరిణామం చెందబోయే వారు తమ ధర్మం చెక్కుచెదరకుండా ఉండాలి.